శ్లోకం
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్
సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి
వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే
అర్థాలు
కృష్ణ – ఓ కృష్ణ
సముపస్థితమ్ – సమీపంలో
యుయుత్సుం – యుద్ధం చేయాలి అని కోరికతో ఉన్న
ఇమమ్ స్వజనం – ఈ బంధువుల సమూహం
దృష్ట్వ – చూస్తుంటే
మమ – నా యొక్క
గాత్రాణి – శరీర భాగములు
సీదంతి – పట్టు తప్పుతున్నాయి
చ – మరియు
ముఖమ్ – ముఖం నోరు
పరిశుష్యతి – తడి ఆరిపోతుంది
చ – ఇంకను
మే – న యొక్క
శరీరే – శరీరం
వేపధుశ్ – కంపిస్తున్నది
రోమహర్షశ్చ – రోమాలు గగ్గురు పొడుస్తున్నాయి
జాయతే – కలుగుచున్నది
భావం
అర్జునుడు కృష్ణునితో ఇలా అంటున్నాడు. ఓ కృష్ణ ఈ రణరంగంలో యుద్ధం చేయాలని ఉత్సహంతో ఉన్న నా యొక్క బంధువుల సమూహాన్ని చూసి, నా శరీరంలో అవయవాలు పట్టుతప్పుతున్నాయి, నోరు ఎండిపోతుంది, శరీరం వణుకుతుంది, శరీరంలో గగ్గురుపాటు కలుగుచున్నవి.
బంధువుల ప్రాధాన్యతను గుర్తించండి
కుటుంబం మరియు స్నేహితులతో సమయాన్ని గడపడం, వారి పట్ల ప్రేమ మరియు కృతజ్ఞతను తెలియజేడం.కష్టకాలంలో స్వజనులకు మద్దతు ఇవ్వడం, వారు మనకు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి ఈ శ్లోకాలు మనకు తెలియజేస్తున్నాయి.
భావోద్వేగాలను అర్థం చేసుకోండి
కష్టకాలంలో మనలో వచ్చే ఆందోళనలను అంగీకరించి, వాటిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలి.మీ యొక్క భావాలను ఇతరులతో పంచుకోవాలి, దాని వలన మన మనసులోని భారం తగ్గుతుంది. అని ఈ శ్లోక వివరణ.
ఆత్మీయ అనుభవాలను పంచుకోండి
సంతోషకరమైన సంఘటనలను మరియు విజయాలను ఇతరులతో పంచుకోవాలి. బాధలు లేదా కష్టాలు ఉన్నప్పుడు వాటిని పంచుకోవడం ద్వారా మానవ సంబంధాలను బలపడతాయి.
ముగింపు
ఈ పద్యం ద్వారా అందించిన సందేశాన్ని మన జీవితాలలో చేరవేసుకోవడం ద్వారా మన సంబంధాలు, భావోద్వేగాలు మరియు అనుభవాలను మెరుగుపరుచుకోవచ్చు. ఇది మానవత్వాన్ని పెంపొందించడానికి, ఆనందాన్ని పొందడానికి మరియు కష్టాలను అధిగమించడానికి సహాయపడుతుంది.