Thiruppavai 29th Pasuram-శిత్తం శిరుకాలే వన్దు

శిత్తం శిరుకాలే వన్దు ఉన్నై చ్చేవిత్తు, ఉన్
పోత్తామరై అడియే పోతుమ్ పొరుళ్ కేళాయ్
పెత్తమ్ మేయ్‍త్తు ఉణ్ణుమ్ కులత్తిల్ పిఱన్దు, నీ
కుత్తేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు
ఇత్తై పఱై కొళ్వాన్ అన్రుగాణ్ గోవిందా
ఎత్తైక్కుమ్ ఏళ్ఏళ్ పిఱవిక్కుం ఉన్ దన్నోడు
ఉత్తోమేయావోమ్ ఉనక్కేనామ్ ఆట్చెయ్‍వోమ్
మత్తైనం కామంగళ్ మాత్తేలోరెంబావాయ్

భావం

తెల తెల వారక మునుపే నీ సానిత్యానికి వచ్చి, నిన్ను సేవించి దర్శించి బంగారము వలే అపూర్వములైన నీ పాదాలను సేవించడంలో మా యొక్క ఉద్దేశమును తెలియజేస్తాము. ఆలమందలను మేపి, భోజనము చేయుటయే పరమార్థమైన మా వంటి వారి గోపకులమున అత్యంత సులభుడువై నీవు అవతరించితివి. ఇక నీ అంతరంగిక సేవలు మేము తప్పకుండా చేయదలచినవి అని అంగీకరించక తప్పదు. వ్రతమునకై పర అను వాద్యము తీసుకొని, నిన్ను వదలి దూరంగా మేము వెళ్ళము. ఇది తెలుసుకో కృష్ణ. ఎప్పుడు ఎన్ని జన్మలకు అయిన నీతో ఉండి, నీకు మాత్రమే సేవకులుగా ఉండి, నీకు సేవలు చేస్తాము స్వామి. ఈ ఆలోచనలకు ఆటకం కలిగించే ఎలాంటి విరుద్ధం అయిన కోరికలు కలగకుండా నువ్వే చూసుకో స్వామి. ఇది మా యొక్క అద్వితీయమైన వ్రతము అని గోపికలు స్వామి ని కోరుతున్నారు.

శిత్తం శిరుకాలే వన్దు ఉన్నై చ్చేవిత్తు, ఉన్

తెల్లవారక ముందే నీ సాన్నిత్యానికి వచ్చి, నిన్ను సేవించి దర్శనం చేసుకుంటాం స్వామి.

పోత్తామరై అడియే పోతుమ్ పొరుళ్ కేళాయ్

బంగారు తామరపువ్వులాంటి నీ పాదాలను సేవించడమే మా లక్ష్యం అని నీకు తెలియజేస్తాము.అని గోపికలు అంటున్నారు.

పెత్తమ్ మేయ్‍త్తు ఉణ్ణుమ్ కులత్తిల్ పిఱన్దు, నీ

పశువులను మేపి, భోజనం చేయడమే ఒక్కటే పరమార్థంగా ఉండే మా గోపకులంలో నీవు జన్మించినవాడివి.

నీ కుత్తేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు

నీ సేవలను చేయటానికి మాకు అవకాశం ఇవ్వకుండా, మమ్మల్ని వదిలిపెట్టకు స్వామి.

ఇత్తై పఱై కొళ్వాన్ అన్రుగాణ్ గోవిందా

ఈ వ్రతం కారణంగా మేము తలచిన సంకల్పాలను నీవు అంగీకరించాలి, గోవిందా!

ఎత్తైక్కుమ్ ఏళ్ఏళ్ పిఱవిక్కుం ఉన్ దన్నోడు

ఎన్ని జన్మలు అయినా నీతో ఉండాలని, నీకు సేవ చేయాలని మేము కోరుతున్నాము.

ఉత్తోమేయావోమ్ ఉనక్కేనామ్ ఆట్చెయ్‍వోమ్

నీ సేవ చేయడమే మాకు పరమ ధర్మం, స్వామి.

మత్తైనం కామంగళ్ మాత్తేలోరెంబావాయ్

మాకు కలిగే ఏ విధమైన కోరికలు నీ భక్తికి ఆటకముగా మారకుండా, వాటిని తొలగించమని మేము ప్రార్థిస్తున్నాము.

ముగింపు

భక్తి అనేది కేవలం శారీరక కార్యాచరణ మాత్రమే కాదు. అది ఒక అంతరంగ భావన, నిష్కలంక ప్రేమ మరియు ఆత్మను సమర్పించడం. గోపికలు ఈ ప్రార్థన ద్వారా ప్రతి భక్తుడికి కృష్ణుడి పట్ల వినయ పూర్వకమైన భక్తిని ప్రేరేపించే ఒక అద్భుతమైన ఉదాహరణ.