Dwadasa Jyotirlinga in Telugu
సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేత్వమామలేశ్వరమ్
పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే
వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే
హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి
భావం
సౌరాష్ట్రలో సోమనాథుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు, ఉజ్జయినిలో మహాకాలుడు, ఓంకారంలో అమలేశ్వరుడు, పర్లిలో వైద్యనాథుడు, ఢాకినిలో భీమశంకరుడు, సేతుబంధంలో రామేశ్వరుడు, దారుకావనంలో నాగేశ్వరుడు, వారణాసిలో విశ్వేశ్వరుడు, గౌతమీ నది ఒడ్డున త్రయంబకుడు, హిమాలయాలలో కేదారేశ్వరుడు, విశాలకలో ఘృష్ణేశ్వరుడు – ఈ జ్యోతిర్లింగాలను ఉదయం సాయంత్రం చదివిన వ్యక్తి ఏడు జన్మల పాపాలనుండి విముక్తి పొందుతాడు.