Vishnu Nama Stotram

అర్జున ఉవాచ

కిం ను నామ సహస్రాణి జపతే చ పునః పునః
యాని నామాని దివ్యాని తాని చాచక్ష్వ కేశవ

శ్రీ భగవాను ఉవాచ

మత్స్యం కూర్మం వరాహం చ వామనం చ జనార్దనమ్
గోవిందం పుండరీకాక్షం మాధవం మధుసూదనమ్
పద్మనాభం సహస్రాక్షం వనమాలిం హలాయుధమ్
గోవర్ధనం హృషీకేశం వైకుంఠం పురుషోత్తమమ్
విశ్వరూపం వాసుదేవం రామం నారాయణం హరిమ్
దామోదరం శ్రీధరం చ వేదాంగం గరుడధ్వజమ్
అనంతం కృష్ణగోపాలం జపతో నాస్తి పాతకమ్
గవాం కోటిప్రదానస్య అశ్వమేధశతస్య చ
కన్యాదానసహస్రాణాం ఫలం ప్రాప్నోతి మానవః
అమాయాం వా పౌర్ణమాస్యామేకాదశ్యాం తథైవ చ
సంధ్యాకాలే స్మరేన్నిత్యం ప్రాతఃకాలే తథైవ చ
మధ్యాహ్నే చ జపన్నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే

ఇతి శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీవిష్ణోరష్టావింశతి నామస్తోత్రం సంపూర్ణం

భావం

అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు, “వేలాది నామాలను జపించడం కన్నా, కొన్ని ముఖ్యమైన దివ్య నామాలను చెప్పమని”. కృష్ణుడు ఈ 28 నామాలను అర్జునుడికి బోధించాడు. ఈ నామాలను జపించడం వలన సర్వ పాపాలు తొలగిపోతాయి. గోవులను దానం చేసిన పుణ్యం, అశ్వమేధ యాగం చేసిన పుణ్యం, వేల కన్యకలను దానం చేసిన పుణ్యం లభిస్తుంది. అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి రోజులలో, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సంధ్యా సమయంలో ఈ నామాలను జపించడం వలన మోక్షం లభిస్తుంది.

👉 YouTube Channel
👉 bakthivahini.com