Ramayanam Story in Telugu – రామాయణం 57

లంబగిరి కొండ మీద దిగిన హనుమంతుడు

Ramayanam Story in Telugu- లంబగిరి కొండ మీంచి చూసిన హనుమంతుడు సముద్రం వైపు తిరిగి “రాముడి దయ ఉంటే ఇలాంటి ఎన్ని సముద్రాలనైనా ఈజీగా దాటేస్తా” అనుకున్నాడు. శ్రీరామ – రామాయణం విభాగం @BhaktiVahini

గెలుపు రహస్యం

వాల్మీకి మహర్షి చెప్పినట్టు, ‘పట్టుదల (ధృతి), మంచి ఆలోచన (దృష్టి), బుద్ధితో నిర్ణయం తీసుకోవడం (మతి), పని చేసే సామర్థ్యం (దాక్ష్యం)’ ఈ నాలుగు విషయాల్ని ఎవరైతే తమ పనుల్లో కలుపుకుంటారో వాళ్లకు ఓటమి అనేది ఉండదు.

లంక అందాలు, హనుమంతుడి ప్లాన్

ఆ కొండ మీద దిగిన హనుమంతుడు విశ్వకర్మ కట్టిన లంక సిటీ అందానికి అవాక్కయ్యాడు. “ఈ లంకను సొంతం చేసుకోవడం సామాన్యం కాదు, దేవతల వల్ల కూడా కాదు” అని మనసులో అనుకున్నాడు. “ఈ రూపంలో సీతమ్మను వెతకడం కష్టం కాబట్టి, పిల్లిలా మారి సీతమ్మను వెతుకుతా” అని డిసైడ్ అయ్యాడు. చీకటి పడ్డాక పిల్లిలా మారి లంక మెయిన్ గేటు దగ్గరికి వెళ్ళాడు.

భయంకరమైన రాక్షసి

అక్కడికి వెళ్ళేసరికి పెద్దగా నవ్వుతూ, కొండంత ఆకారంతో ఒక రాక్షసి కనిపించింది. అది హనుమంతుడిని చూడగానే “ఎవరు నువ్వు? అడవుల్లో తిరిగే కోతివి ఇక్కడ ఏం పని నీకు? ఎందుకు వచ్చావ్?” అని గట్టిగా అడిగింది.

హనుమంతుడి మాట

హనుమంతుడు “ఓ వింత కళ్లదానా! నేను ఒకసారి ఆ తోటల్ని, చెట్లను, భవనాల్ని, చెరువుల్ని చూసి వస్తాను. కాస్త పర్మిషన్ ఇవ్వు” అన్నాడు.

రాక్షసి అడ్డు

ఆ రాక్షసి “నేను పర్మిషన్ ఇవ్వడానికి ఏం కాదు. నన్ను గెలిచినోడే లోపలికి వెళ్లగలడు. నువ్వు లోపలికి పోడానికి వీల్లేదు” అని తేల్చి చెప్పింది.

హనుమంతుడు “సరే ఇంతకీ నువ్వెవరు?” అని ఆ రాక్షసిని క్వశ్చన్ చేశాడు.

ఆమె “నేను లోపల ఉన్న పెద్ద మనిషి రావణుడి ఆర్డర్‌తో ఈ లంక సిటీకి కాపలా కాస్తుంటాను” అని చెప్పి సడన్‌గా హనుమంతుడిని తన చేత్తో ఒక దెబ్బ కొట్టింది.

ఆ దెబ్బకు హనుమంతుడికి పట్టరాని కోపం వచ్చింది. కుడి చేత్తో కొడితే చచ్చిపోతుందని ఎడమ చేత్తో ఒక్క గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకు ఆమె కళ్ళు తేలేసి కింద పడిపోయింది.

అప్పుడామె “నన్ను లంకిణి అంటారు. నువ్వు నన్ను గెలిచావ్. నేను ఈ రావణాసురుడి బాధ భరించలేకపోతున్నాను. చాలా ఏళ్ల నుంచి నన్ను విసిగిస్తున్నాడు. ‘ఒక కోతి వచ్చి నిన్ను గెలిచిన రోజు నీకు ఈ రావణుడి బాధ తప్పుతుంది’ అని బ్రహ్మ దేవుడు నాకు వరం ఇచ్చాడు. ఇప్పుడు అర్థమైంది ఈ లంకలోని రాక్షసుల పని, రావణుడి పని అయిపోయింది. ఇక నువ్వు లోపలికి వెళ్ళి సీతమ్మను కనిపెట్టు” అని మెయిన్ గేటు తీసింది.

లంకలోకి ఎంట్రీ

హనుమంతుడు అక్కడున్న గోడ మీంచి ఎగిరి లోపలికి ఎడమ కాలు పెట్టి దూకాడు. లోపలికి వెళ్ళి ఆ లంక సిటీని చూడగా ఏదో గంధర్వుల ఊరిలా ఉంది. అక్కడున్న మేడలు, స్తంభాలు బంగారంతో చేసి ఉన్నాయి. అన్నిటికీ నవరత్నాలు పొదిగి ఉన్నాయి. స్ఫటికాలతో మెట్లు కట్టారు. ఎక్కడ చూసినా బావులు, చెరువులతో ఆ ఏరియా చాలా అందంగా ఉంది.

ఆ ప్లేస్ చెట్లతో, పక్షులతో, పండ్లతో, నెమళ్ల కేకలతో, ఏనుగులతో, బంగారు రథాలతో సూపర్బ్‌గా ఉంది. ఆ నైట్ టైమ్‌లో ఆకాశంలో ఉన్న చందమామ వెన్నెల కురిపిస్తూ లోకంలోని పాపాలన్నీ పోగొట్టేవాడిలా ఉన్నాడు. ఆ చందమామ వెలుతురులో హనుమంతుడు లంక సిటీ వీధుల్లో సీతమ్మ కోసం వెతుకుతున్నాడు.

లంకలో జనాలు

లంక సిటీలో ఉన్నవాళ్లంతా దీక్షలు చేసినోళ్లు. కొందరైతే తల మీద వెంట్రుకలన్నీ తీయించుకున్నారు. కొందరు ఎద్దు చర్మాలు కట్టుకొని తిరుగుతున్నారు. కొంతమంది దర్భ గడ్డిని చేత్తో పట్టుకున్నారు. ఇంకొందరు అగ్నిగుండాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఒకడు పక్కోడికి తన గుండెను చూపిస్తున్నాడు.

కొంతమంది తమ బాడీలను కనపడ్డ ఆడోళ్ల మీద పడేస్తున్నారు. కొందరు ఎప్పుడూ తమ చేతుల్లో పెద్ద పెద్ద త్రిశూలాలు పట్టుకొని తిరుగుతున్నారు. కొంతమంది ఒకరినొకరు తోసుకుంటూ ఉన్నారు. తమ భుజాల బలాన్ని చూపిస్తున్నారు. ఒకరినొకరు తిట్టుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఆ లంకలో ఒకడు త్రిశూలం, ఒకడు గునపం, ఒకడు ఇనుప గద ఇలా రకరకాల ఆయుధాలు పట్టుకొని ఉన్నారు.

సీతమ్మ కోసం వెతుకులాట

హనుమంతుడు రాక్షసులందరి ఇళ్లల్లోకి వెళ్ళి సీతమ్మ కోసం వెతికాడు. ఆ టైమ్‌లో రాక్షస ఆడోళ్లంతా తమ మొగుళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.ప్రహస్త, కుంభకర్ణ, మహోదర, విరూపాక్ష, విద్యున్మాలి, వజ్రదంష్ట్ర, సుఖ, సారణ, ఇంద్రజిత్, జంబుమాలి, సుమాలి, రస్మికేతు, సూర్యకేతు, వజ్రకాయ, ధూమ్రాక్ష, భీమ, ఘన, హస్తిముఖ, కరాళ, పిశాచ, మత్త, ధ్వజగ్రీవ, సుకనాస, వక్ర, శట, వికట, బ్రహ్మకర్ణ, దంష్ట్ర, రోమస అని అక్కడ రాక్షసుల ఇళ్లల్లోకి వెళ్ళి సీతమ్మ కోసం వెతికాడు.

సీతమ్మ ఎలా ఉంటుందో ఊహ

ఆ ఆడోళ్లందరినీ చూసిన హనుమంతుడు “మా అమ్మ సీతమ్మ ఇలా ఉండదు. మా సీతమ్మ కనిపించి కనపడకుండా ఉండే సన్నటి చందమామ రేఖలా ఉంటుంది. మట్టి పట్టిన బంగారు తీగలా ఉంటుంది. బాణం దెబ్బ తగిలిన నొప్పిలా ఉంటుంది. గాలికి కొట్టుకుపోయే మబ్బులా ఉంటుంది” అనుకుంటూ లంక సిటీ అంతా వెతుకుతూ రావణాసురుడి బంగ్లా దగ్గరికి వెళ్ళాడు.

రావణుడి అంతఃపురం

అది రాక్షసుల రాజు రావణాసురుడి ఇల్లు. దాని మొదటి గేటు దగ్గర కొంతమంది గుర్రాల మీద కాపలా కాస్తుంటారు. రెండో గేటు దగ్గర ఏనుగుల మీద కొందరు తిరుగుతూ ఉంటారు. దాని వెనకాల గేటు దగ్గర కొందరు కత్తులు పట్టుకొని తిరుగుతుంటారు. దాని తర్వాత గేటు దగ్గర రాజు నిద్ర లేవగానే ఒంటికి రాయడానికి కొందరు చందనం తీస్తుంటారు. తర్వాత గేటు దగ్గర ఆయన పెట్టుకునే పూలదండలు ఉంటాయి. దాని వెనకాల ఆయనకు బాగా నిద్ర పట్టడానికి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్‌తో మెల్లగా పాటలు కొందరు వాయిస్తూ ఉంటారు.

‘ఇంకా అందరూ నిద్రపోలేదు కాబట్టి కాసేపయ్యాక రావణుడి ఇంట్లోకి వెళ్ళి చూస్తాను’ అని హనుమంతుడు అనుకొని బయటికి వచ్చి మళ్ళీ కొన్ని ఇళ్లల్లోకి వెళ్ళి చూశాడు. ఆ ఇళ్లల్లో ఉన్న రాక్షసులు లంకకు పూజ చేస్తూ శంఖాలు, డప్పులు, గంటలు మోగిస్తున్నారు. అక్కడ ఉన్న ఇళ్ళు చూసి “ఇది ఇంద్రుడి ఊరా? గంధర్వుల సిటీనా? పొరపాటున నేను స్వర్గానికి వచ్చానా? అసలు ఇంద్రుడికి ఎన్ని సుఖాలున్నాయో అవన్నీ ఈ లంక సిటీలో కనిపిస్తున్నాయి” అనుకున్నాడు.

అక్కడున్న ఇళ్లల్లో ఎంత పెద్ద పండితుడైనా ఒక తప్పు కూడా చూపలేడు. అంత బాగా ఉన్నాయి ఆ ఇళ్ళు. దేవతలకు కూడా ఆ ఇళ్లల్లోకి వస్తే పూజ చేసుకోవాలనిపిస్తుంది. అక్కడున్న కిటికీలు కూడా వజ్రాలు, వైఢూర్యాలతో అలంకరించి చాలా అందంగా ఉన్నాయి. ఆ లంక సిటీ అందాన్ని హనుమంతుడు చాలా శ్రద్ధగా చూశాడు. ఆ రాక్షసుల ఇళ్లన్నీ వెతికిన తర్వాత హనుమంతుడు మెల్లగా రావణుడి ఇంట్లో ఉన్న పుష్పక విమానంలోకి ఎంటర్ అయ్యాడు. (పుష్పక విమానాన్ని ఫస్ట్ విశ్వకర్మ తయారు చేసి బ్రహ్మకు ఇచ్చాడు. కొంతకాలానికి కుబేరుడు బ్రహ్మ గురించి తపస్సు చేస్తే బ్రహ్మ దేవుడు కుబేరుడికి పుష్పక విమానాన్ని ఇచ్చాడు. కుబేరుడి తమ్ముడైన రావణుడు ఆయనను చంపి ఆ విమానాన్ని తెచ్చుకున్నాడు).

ఆ పుష్పక విమానంలో కూర్చుని మనసులో ఒక ప్లేస్‌ను ఊహించుకుంటే అది కళ్ళు మూసి తెరిచేలోగా అక్కడికి తీసుకెళ్తుంది. ఆ పుష్పకానికి వజ్రాలు, వైఢూర్యాలతో డిజైన్స్ చేసి ఉంటాయి. అందులో చెరువులు, తామర పువ్వులు, తోటలు, బంగారంతో చేసిన బల్లలు, కూర్చోడానికి సీట్లు, పడుకోడానికి పరుపులు, తిరగడానికి ప్లేసులు ఉంటాయి. అందులోకి ఎంతమంది ఎక్కినా ఇంకా ఒకరికి ఖాళీ ఉంటుంది. అందులో ఉన్న తివాచీ మీద ఈ భూమి మొత్తం బొమ్మలు గీసి ఉన్నాయి. ఈ భూమి మీద ఎన్ని కొండలు ఉన్నాయో అవన్నీ ఆ తివాచీ మీద చెక్కి ఉన్నాయి.

అలాగే ఏ కొండ మీద ఎన్ని చెట్లు ఉన్నాయో అన్ని చెట్లు అందులో ఉన్నాయి. వాటితో పాటు ఆ చెట్లకున్న పువ్వులే కాకుండా ఆ పువ్వుల్లోని పుప్పొడి కూడా చెక్కి ఉంది. దాని పక్కనే లక్ష్మీదేవి తామర పువ్వుల్లో పద్మాసనం వేసుకొని నాలుగు చేతులతో కూర్చున్నట్టుగా, రెండు ఏనుగులు బంగారు కుండలు పట్టుకొని, తామర రేకులతో అమ్మవారిని అభిషేకిస్తున్నట్టుగా అక్కడ ఒక బొమ్మ ఉంది.

సీతమ్మ బాధ

హనుమంతుడు “మా అమ్మ ఇలాంటి ప్లేస్‌లో ఇలా రాక్షసులతో కలిసి మందు తాగి హ్యాపీగా ఉండదు. మా అమ్మ కళ్ల వెంట వేడి నీళ్లు కారుతూ గుండె మీద పడిపోతూ ఉంటాయి. రాముడు కట్టిన పొడవైన మంగళసూత్రం మా అమ్మ మెడలో మెరుస్తూ ఉంటుంది. మా అమ్మ కళ్ళ వెంట్రుకలు నల్లగా, దట్టంగా ఉంటాయి, నిండు ప్రేమ కురిపించే కళ్ళతో మా అమ్మ ఉంటుంది. అడవిలో ఉన్న నెమలిలా మా అమ్మ ఉంటుంది” అనుకుంటూ పుష్పక విమానం నుంచి కిందకి దిగి రావణాసురుడు పడుకున్న రూమ్ వైపు వెళ్ళాడు.

లంకలోకి ఎంట్రీ ఇచ్చిన హనుమంతుడు అక్కడ కనిపించిన రకరకాలైన నేచర్ సీన్లు, శిల్పాలు, భయంకరమైన రాక్షస మూకల్ని చూసినా సరే, తన మెయిన్ టార్గెట్ అయిన సీతమ్మను వెతకడం మాత్రం అస్సలు మర్చిపోలేదు. దానికోసం రాత్రింబగళ్లు తిరిగాడు. ఇది హనుమంతుడి భక్తికి, తెలివికి, ధైర్యానికి, ఇంకా ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే తెగువకు ఒక మంచి ఎగ్జాంపుల్.

MS Rama Rao Sundarakanda Telugu

https://youtu.be/bqDv7hjsgN8

  • Related Posts

    Ramayanam in Telugu-రామాయణం 63-కిష్కిందకు తిరుగు ప్రయాణం

    హనుమంతుని ఉత్సాహపూరిత ఆగమనం Ramayanam Story in Telugu- ఆకాశంలోని మేఘాలను తాగుతున్నాడా అన్నట్లుగా వేగంగా ఎగురుకుంటూ వెళ్ళిన హనుమంతుడు, ఉత్తర దిక్కున తన కోసం ఎదురుచూస్తున్న వానరుల వద్దకు చేరుకోగానే ఒక పెద్ద ధ్వని చేశాడు. ఆ శబ్దం విన్న…

    భక్తి వాహిని

    భక్తి వాహిని
    Ramayanam Story in Telugu – రామాయణం 62

    సీతమ్మ వద్ద సెలవు మరియు సంకల్పం Ramayanam Story in Telugu- హనుమంతుడు సీతమ్మ దగ్గర సెలవు తీసుకుని ఉత్తర దిక్కుకు వచ్చాడు. అప్పటికే లంకా పట్టణానికి రావడం, సీతమ్మ తల్లిని దర్శించడం పూర్తయ్యాయి. రావణుడికి ఒక మాట చెబితే ఏమైనా…

    భక్తి వాహిని

    భక్తి వాహిని