Bhagavad Gita in Telugu Language
ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన
నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ
జనార్దన – ఓ వాసుదేవా
ఉత్సన్న – ఉద్భవించిన
కులధర్మాణాం – కుటుంబ ధర్మాలు
మనుష్యాణాం – మనుషులకు
అనియతం – నిరంతరం
నరకే – నరకంలో
వాసో – నివాసం
భవతి – అవుతుంది
ఇత్యనుశుశ్రుమ – అని ఇట్లా విన్నాను
అర్జునుడు కృష్ణునితో మాట్లాడుతూ, కుల ధర్మాల నాశనం వల్ల కుటుంబాలు అధోగతికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులు అందరికి శాశ్వాతంగా నరక ప్రాప్తి తప్పదు అని ప్రతీతి అని చెప్పుచున్నాడు.
భగవద్గీతలోని శ్లోకాలు మన జీవితానికి మార్గదర్శకాలు. “ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ” అనే శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణునితో మాట్లాడుతున్నాడు. ఇది కేవలం భగవద్గీతలోని శబ్దం మాత్రమే కాదు, మన జీవితాలకి అత్యంత ముఖ్యమైన సందేశం.
కుల ధర్మాలు అనేవి కేవలం సాంప్రదాయాలు మాత్రమే కాదు. అవి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, భక్తి, క్రమశిక్షణ మరియు జీవన విధానాలకు ఉపదేశాలుగా చెప్పవచ్చును. ఇవి ఉన్నప్పుడు మనిషికి గౌరవం, సమాజంలో స్థానం మరియు శాంతి ఉంటాయి. కాని అవి నశిస్తే కుటుంబం అదుపు తప్పుతుంది. ఈ అనుశాసనాలు మన జీవితాలను పరిపూర్ణం చేయడానికి బలమైన పునాదిని వేస్తున్నాయి.
ధర్మం నశిస్తే కుటుంబ సభ్యల మధ్య బంధాలు తెగిపోతాయి. సంబంధాలలో దూరం పెరుగుతుంది. చిన్నతనం నుంచే పిల్లలకు సన్మార్గాలు నేర్పించడం ద్వారా తరువాతి తరాలకు ధర్మ బలాన్ని కొనసాగించగలం. అయితే ఇవి లోపించినప్పుడు మనుషులు స్వార్ధబుద్ధితో నడుచుకుంటూ తమ కుటుంబాలను మరియు సమాజాన్ని నాశనం చేస్తారు. అర్జునుడు చెప్పినట్లుగా, దీనివల్ల ఆ కుటుంబాలకు నరక ప్రాప్తి అనివార్యం అని చెప్పవచ్చు.
ప్రస్తుత కాలంలో సాంప్రదాయాలు తగ్గిపోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలహీనమవుతున్నాయి. ఇది ధర్మ నాశనానికి ఒక సంకేతం. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ తమ కుటుంబ బంధాలను, ధర్మాలను, సాంప్రదాయాలను గౌరవించాలి. పిల్లలకు చిన్నతనం నుంచే సంస్కారం నేర్పించాలి.
మీ కుటుంబాన్ని ధర్మపథంలో నడిపించడం మీ చేతుల్లోనే ఉంది. మీరు చేసే ప్రతి మంచి మంచి పని ఒక మంచి మార్గం అయ్యి మీ తరువాత తరాల యొక్క జీవనం శ్రేయస్కరంగా మారుస్తుంది. కుటుంబ ధర్మాలను కాపాడటం ద్వారా మీరు కేవలం మీ కుటుంబాన్ని మాత్రమే కాదు, సమాజాన్నికూడా నిలబెట్టగలరు. కుల ధర్మాలను నిలబెట్టే బాధ్యత మనందరి మీద ఉంది.
ప్రకాశవంతమైన కుటుంబాన్ని నిర్మిద్దాం. ధర్మబలాన్ని ప్రోత్సహిద్దాం. అందరికీ శాంతి మరియు ఆనందాన్ని అందిద్దాం!
Bhagavad Gita Chapter 10 Verse 8 ప్రతిరోజూ ఉదయం లేచి, మనం ఎన్నో కలలతో, ఆశలతో రోజును ప్రారంభిస్తాం.…
Bhagavad Gita Chapter 10 Verse 7 ఈ రోజుల్లో చాలా మంది ఉదయం లేవగానే ఒక రకమైన అలసటతో…
Bhagavad Gita Chapter 10 Verse 6 ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య – "అసలు నేనెవరిని?…
Bhagavad Gita Chapter 10 Verse 4 & 5 ఈ రోజుల్లో చాలా మందిని పట్టి పీడిస్తున్న ఒకే…
Bhagavad Gita Chapter 10 Verse 3 మనలో చాలామంది రాత్రి పడుకునే ముందు ఒకే ఆలోచనతో సతమతమవుతుంటారు. "ఈరోజు…
Bhagavad Gita Chapter 10 Verse 2 మనలో చాలా మంది జీవితం... బయట ప్రపంచంతో యుద్ధం చేయడం కంటే,…