బిల్వాష్టకం తెలుగులో

త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధమ్ 
త్రిజన్మ పాపసంహారమ్, ఏకబిల్వం శివార్పణమ్ 

త్రిదళములు గలది, మూడు గుణములు కలది, మూడు కన్నులు కలది, మూడు ఆయుధములు కలది, మూడు జన్మల పాపములను నశింపజేయునది, ఒక బిల్వపత్రము శివునికి సమర్పణము.

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః 
శివపూజాం కరిష్యామి, ఏకబిల్వం శివార్పణమ్ 

మూడు శాఖలు గల, రంధ్రములు లేని, లేతవైన, శుభకరమైన బిల్వపత్రములతో నీ పూజను చేసెదను, ఒక బిల్వపత్రము శివునికి సమర్పణము.

అఖండ బిల్వపత్రం పూజితే నందికేశ్వరీ 
శుద్యంతి సర్వపాపేభ్య ఏకబిల్వం శివార్పణమ్ 

ఖండించబడని బిల్వపత్రముతో నందికేశ్వరుని పూజించిన, సర్వపాపములు తొలగును, ఒక బిల్వపత్రము శివునికి సమర్పణము.

సాలగ్రామ శిలామేకం జాతు విప్రాయ యోర్పయేత్  
సోమయజ్ఞ మహాపుణ్యమ్ ఏకబిల్వమ్ శివార్పణమ్ 

సాలగ్రామ శిలను బ్రాహ్మణునికి దానం చేసిన, సోమయాగము చేసినంత పుణ్యము కలుగును, ఒక బిల్వపత్రము శివునికి సమర్పణము.

దంతి కోటి సహస్రాణి వాజపేయశతాని చ  
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణమ్ 

వేల కోట్ల ఏనుగులు, వందల వాజపేయ యాగములు, కోటి కన్యల మహాదానము, ఒక బిల్వపత్రము శివునికి సమర్పణము.

పార్వత్య స్వేదసంజాతం మహాదేవస్య చ ప్రియమ్ 
బిల్వవృక్షం నమస్యామి ఏకబిల్వం శివార్పణమ్ 

పార్వతి దేవి స్వేదము నుండి పుట్టినది, మహాదేవునికి ప్రియమైనది బిల్వవృక్షమును నమస్కరిస్తాను, ఒక బిల్వపత్రము శివునికి సమర్పణము.

దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనమ్ 
అఘోరపాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణమ్ 

బిల్వ వృక్షమును దర్శించుట పుణ్యము, స్పర్శించుట పాపనాశనము, ఘోర పాప సంహారము, ఒక బిల్వపత్రము శివునికి సమర్పణము.

మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే 
అగ్రత శివరూపాయ ఏకబిల్వం శివార్పణమ్ 

వేరునందు బ్రహ్మరూపుడు, మధ్యలో విష్ణురూపుడు, అగ్రమున శివరూపుడు, ఒక బిల్వపత్రము శివునికి సమర్పణము.

బిల్వాష్టకమిదం పుణ్యం యః పటేత్ శివసన్నిదౌ
సర్వపాప వినిర్ముక్త శివలోకమవాప్నుయాత్ 

ఈ బిల్వాష్టకము పుణ్యప్రదమైనది, శివుని సన్నిధిలో ఎవరు చదువుతారో వారు సర్వపాపములు తొలగి శివలోకమును పొందుతారు.

ఇతి శ్రీ బిల్వాష్టకమ్ సమాప్తమ్

👉 YouTube Channel
👉 bakthivahini.com