Matsya Jayanti
దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో మొదటిది మత్స్యావతారం. శ్రీమహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించిన చైత్రమాసంలోని శుక్లపక్ష తదియనాడు ‘మత్స్యజయంతి’ పండుగను జరుపుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. సృష్టి ప్రారంభానికి అవసరమైన వేదకోశాన్ని రక్షించేందుకే శ్రీమహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించాడు. అంటే, స్వామివారు పరోక్షంగా ఈ సృష్టి జరగడానికి కారకుడని చెప్పవచ్చు. అటువంటి మత్స్యావతార ఆవిర్భావాన్ని గురించిన ప్రస్తావన శ్రీమత్స్యపురాణముతో పాటు శ్రీమద్భాగవతంలోనూ ఉంది.
మత్స్యజయంతి, శ్రీమహావిష్ణువు మొదటి అవతారం అయిన మత్స్య అవతారాన్ని జరుపుకునే పండుగ. 2025 సంవత్సరంలో ఈ పండుగ మార్చి 31, సోమవారం జరుపుకోబడుతుంది. ఇది చైత్ర మాసంలో శుక్లపక్ష త్రితీయ (చంద్రుడి పెరుగుతున్న దశలో మూడవ రోజు) రోజున జరుగుతుంది.
| విశేషాలు | సమయం |
| త్రితీయ తిథి ప్రారంభం | మార్చి 31, 2025, ఉదయం 9:11 |
| త్రితీయ తిథి ముగింపు | ఏప్రిల్ 1, 2025, ఉదయం 5:42 |
| పూజా ముహూర్తం | మధ్యాహ్నం 1:00 – 3:28 (2 గంటలు 28 నిమిషాలు) |
| ఆచారం | వివరణ |
|---|---|
| ఉపవాసం | మత్స్యజయంతి రోజున భక్తులు ఉపవాసం ఆచరిస్తారు. |
| ఈ ఉపవాస సమయంలో కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. | |
| కొన్ని భక్తులు నీరు కూడా తీసుకోకుండా పూర్తి ఉపవాసం పాటిస్తారు. | |
| పూజ మరియు పారాయణం | ఈ రోజున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. |
| విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. | |
| మత్స్య పురాణాన్ని చదవడం లేదా వినడం చేస్తారు. | |
| దానం | ఆహారం, వస్త్రాలు మరియు అవసరమైన వస్తువులను పేదలకు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. |
| చేపలకు ఆహారం వేయడం కూడా చాలా మంచిది. | |
| దేవాలయ సందర్శన | విష్ణు దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. |
| ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌లోని నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించడం విశిష్టమైనది. | |
| ఈ దేవాలయంలోని వేదనారాయణస్వామి మత్స్యావతారంలో దర్శనమిస్తారు. |
| అంశం | వివరణ |
|---|---|
| రాక్షసుడు | శంఖాసురుడు (సోమకాసురుడు) |
| జన్మతనం | శ్రీమహావిష్ణువు శంఖం నుంచి జన్మించాడు |
| ఆపధ్ధారిత్వం | బ్రహ్మదేవుడి వద్దకు చేరి వేదాలను అపహరించాడు |
| పరిష్కారం | శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరించి రక్షణ ఇచ్చాడు |
పూర్వం శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉన్న సమయంలో ఆయన చేతిలోని శంఖం జారి ప్రళయజలాల్లో పడింది. నీటిలో పడిన ఆ శంఖం నుండి ఒక రాక్షసుడు జన్మించాడు. శంఖం నుండి జన్మించినందువల్ల అతనికి ‘శంఖాసురుడు’ అనే పేరు ఏర్పడింది. అతడు రాక్షస ప్రవృత్తి కలవాడు. సోమకాసురుడు అని కూడా పేరు కలిగిన శంఖాసురుడు పెద్ద శరీరాన్ని కలిగినవాడు.
ఆ రాక్షసుడు ఆకలి బాధతో ఆర్తనాదాలు చేస్తూ ఆహారం కోసం అన్వేషిస్తూ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి వద్దకు చేరుకుని బ్రహ్మను మింగడానికి ప్రయత్నించాడు. దీంతో బ్రహ్మదేవుడు భయపడి లేచి పారిపోసాగాడు. బ్రహ్మ పైకి లేవగానే బ్రహ్మ తొడపై ఉన్న వేదకోశం కింద పడింది. దానిని చూడగానే సోమకాసురుడు ఆత్రంగా తీసుకుని నోటిలో వేసుకుని మింగాడు. దీంతో బ్రహ్మదేవుడు సృష్టి చేయడం కష్టమై శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్లి విషయం వివరించాడు.
దీంతో శ్రీమన్నారాయణుడు బ్రహ్మను ఓదార్చి, “భయపడవద్దు… ఆ రాక్షసుణ్ణి సంహరించి వేదగ్రంథాన్ని తెచ్చి ఇస్తాను” అని పలికి మత్స్యావతారం ధరించాడు. మత్స్యావతారం ధరించిన శ్రీమన్నారాయణుడు నాలుగు చేతులలో గద, చక్రాలను ధరించి జలంలో ప్రవేశించి… చక్రంతో శంఖాసురుడి శిరస్సును ఖండించి తన శంఖంతోపాటు “వేదకోశము”ను తెచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు.
అనంతరం బ్రహ్మ తిరిగి సృష్టి ప్రారంభించినట్లు పురాణ కథనం. ఈ విధంగా శంఖాసురుడిని అంతమొందించి సృష్టి నిరంతరాయంగా సాగడం కోసం శ్రీహరి మత్స్యావతారం ఎత్తినట్లు శ్రీమత్స్యపురాణంలో చెప్పబడింది.
శ్రీమద్భాగవతంలో మరో గాథ ఉంది. పూర్వం వరాహకల్పంలో ద్రవిడరాజు అయిన సత్యవ్రతుడు కృతమాలికా నదీతీరంలో జలతర్పణం చేస్తున్న సమయంలో ఒక ‘చేపపిల్ల’ చేతిలోకి వచ్చింది. దానిని ఆ రాజు నీటిలో వదిలేందుకు ప్రయత్నించగా ఆ చేపపిల్ల “రాజా! నీటిలో వదలకుండా నన్ను రక్షించండి” అంటూ వేడుకుంది. దీంతో రాజు ఆ చేపపిల్లను కమండలంలో వేసుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు. మరునాటికి ఆ చేప పెద్దదై కమండలంలో పట్టలేదు. గంగాళంలో వేయగా మరుసటి రోజు చేప మరింత పెద్దది అవడంతో చెరువులో వేశాడు. చేప ఇంకా పెద్దది అవడంతో రాజు దానిని తీసుకుని పోయి సముద్రంలో విడిచిపెట్టాడు. ఆ సమయంలో విపరీతంగా పెరుగుతూ ఉన్న చేపను చూసి రాజు ఆశ్చర్యంతో నీవు ఎవరు అని అడుగగా, “నేను జనార్దనుడను… ఇక కొన్ని రోజులకు జల ప్రళయం వస్తుంది… అప్పుడు సప్తఋషులతో ఒక నావ నీ దగ్గరకు వస్తుంది… నీవు నావలోకి ఎక్కు.. నేను రక్షిస్తాను” అని చేప సమాధానం ఇచ్చింది.
ఆ తర్వాత ప్రళయం వచ్చింది. ప్రళయకాలంలో సత్యవ్రతుడు సర్వపదార్థములను స్వీకరించి మత్స్యం చెప్పినట్లు చేశాడు. ఫలితంగా ప్రళయకాలంలో రాజు రక్షింపబడ్డాడు. అంతేకాకుండా ప్రళయకాలంలో నావలో ఉండి రక్షింపబడిన సర్వపదార్థములలోని విత్తనాల నుండి తిరిగి ప్రపంచం, సర్వపదార్థములు ఏర్పడినట్లు శ్రీమద్భాగవతంలో వివరించబడింది.
ఈ రోజు శ్రీమహావిష్ణువుకు శాంతి, సంపద మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ఆశీర్వాదాలను కోరుకునేందుకు అత్యంత శుభమైనది.
Bhagavad Gita 700 Slokas in Telugu మనిషి జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం తీసుకునే ప్రతి…
Karthika Puranam Telugu జలంధరుని యుద్ధ సన్నాహాలు ఓ పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని…
Karthika Puranam Telugu మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తూన్న జలంధరునికి భయపడినవారై దేవతలంతా విష్ణు స్తోత్రం…
Karthika Puranam Telugu తులసి మహాత్మ్యంపై పృధు చక్రవర్తి ప్రశ్న పృధు చక్రవర్తి నారదుడిని అడుగుతున్నాడు: 'దేవర్షీ! తులసిని స్థాపించి,…
Karthika Puranam Telugu నారదుడు చెబుతున్నాడు: ఓ పృథు భూపాలా! కార్తీక వ్రతం పాటించే పురుషుడు తప్పకుండా ఆచరించవలసిన నియమాలను…
Karthika Puranam Telugu నారదుడు చెప్పినదంతా విన్న పృథువు 'ఓ దేవర్షీ! కార్తీక మాసపు గొప్పదనమును వివరించి, నన్ను ధన్యుని…