రామాయణం

Ramayanam Story in Telugu-రామాయణం 8

గంగా నది యొక్క పవిత్రత – విశ్వామిత్రుని కథనం

Ramayanam Story in Telugu – రాముడు మరియు లక్ష్మణుడు విశ్వామిత్రునితో కలిసి ప్రయాణిస్తూ గంగా నదిని చేరుకున్నారు. గంగను చూడగానే అందరూ సంతోషించారు. మహర్షులు తమ పితృదేవతలకు తర్పణం సమర్పించి, అగ్నిహోత్రం చేసి, మిగిలిన హవిస్సును అమృతంగా భావించి తిన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు కథ చెప్పడం ప్రారంభించాడు.

కుశనాభుడు మరియు గాధి జననం

కుశనాభుడికి నూరుగురు కుమార్తెలు ఉన్నారు, కాని కుమారులు లేరు. తనకి కుమారులు కలగడం కోసం పుత్రకామేష్టి యాగం ప్రారంభించాడు. ఆ యాగం జరుగుతుండగా కుశనాభుడి తండ్రి కుశమహారాజు అక్కడికి వచ్చి, “నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, గాధి అనేవాడు నీకు కొడుకుగా జన్మించి మన వంశం పేరు నిలబెడతాడు” అన్నాడు.

🌐 https://bakthivahini.com/

విశ్వామిత్రుడు రాముడితో “నేను ఆ గాధి యొక్క కుమారుడినే” అని చెప్పాడు.

స పితా మమ కాకుత్స్థ గాధిః పరమ ధార్మికః
కుశ వంశ ప్రసూతో అస్మి కౌశికో రఘునందన

ఓ రామా! గాధి నా తండ్రి, ఆయన గొప్ప ధర్మవంతుడు. నేను కుశ వంశంలో జన్మించాను కాబట్టి నన్ను కౌశికుడని అంటారు.

విశ్వామిత్రుని వంశం మరియు కౌశికి నది

విశ్వామిత్రుడు రాముడితో ఇంకా ఇలా అన్నాడు, “నా అక్క పేరు సత్యవతి. ఆమె భర్త ఋచకుడు. కొంతకాలానికి మా బావగారు శరీరం విడిచిపెట్టారు. అప్పుడు మా అక్క ఉండలేక సశరీరంగా బావతో స్వర్గానికి వెళ్ళిపోయింది. ఆమె కౌశికి అనే నదిగా హిమాలయాల మీద ప్రవహిస్తుంది. అందుకే నేను ఎక్కువగా హిమాలయాల మీద, మా అక్కకి దగ్గరగా ఉంటాను. ఈ సిద్ధాశ్రమానికి యాగం చేయడానికి వచ్చాను. నీ తేజస్సు చేత రక్షింపబడ్డాను.” అక్కడ ఉన్న ఋషులు విశ్వామిత్రునితో,

విశేషేణ భవాన్ ఏవ విశ్వామిత్ర మహాయశః
కౌశికీ సరితాం శ్రేష్ఠః కుల ఉద్యోతకరీ తవ

“మీ వంటి వారు పుట్టడం చేత మీ వంశం ధన్యమైంది, మీ అక్కగారి వల్ల మీ వంశం పరమ పావనమైంది.”

గంగకు త్రిపథగ అనే పేరు ఎలా వచ్చింది?

రాముడు గంగకు “త్రిపథగ” అన్న నామం ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి విశ్వామిత్రుడిని అడిగాడు. విశ్వామిత్రుడు ఈ విషయాన్ని వివరించాడు. గంగ పూర్వం స్వర్గంలో ప్రవహించి, తరువాత భూలోకానికి తీసుకురాబడి, పాతాళానికి చేరి మూడు లోకాలలో ప్రవహించినది కనుక త్రిపథగ అని పిలుస్తారు. ఈ కథను క్రింది పట్టికలో సంగ్రహించవచ్చు:

వివరణవిశ్వామిత్రుడి కథ
గంగ పుట్టుకహిమవంతుడు మరియు మనోరమ కుమార్తె.
స్వర్గంలో ప్రవాహందేవతల కోరిక మేరకు స్వర్గంలో ప్రవహించింది.
భూలోకానికి వచ్చేందుకు కారణంభూలోకానికి తీసుకురాబడింది.
త్రిపథగ అనే పేరు వచ్చేందుకు కారణంమూడు లోకాలలో (స్వర్గం, భూలోకం, పాతాళం) ప్రవహించింది.

ఈ విధంగా, గంగ మూడు లోకాలలో ప్రవహించినందుకు త్రిపథగ అని పిలువబడుతుంది.

పార్వతీ పరమేశ్వరుల కథ

విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు: పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో 100 దివ్య సంవత్సరాలు క్రీడించారు. ఈ విషయం విన్న దేవతలకి ఆశ్చర్యమేసింది. పార్వతీదేవి, శంకరుడి తేజస్సులు అసామాన్యమైనవి. వారి కలయిక వల్ల జన్మించే భూతాన్ని మనం తట్టుకోలేమని దేవతలంతా కైలాసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్థించారు. శంకరుడు బయటకు వచ్చాడు. వాళ్ళు ఆయనతో, “స్వామీ! మీరు పార్వతీదేవితో 100 దివ్య సంవత్సరాల నుంచి క్రీడిస్తున్నారు. మీ తేజస్సు వేరొక ప్రాణి రూపంలో వస్తే మేము ఎవరము దానిని తట్టుకోలేము. మీరు మీ తేజస్సుని మీలోనే పెట్టుకొని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి” అన్నారు.

వాళ్ళు చెప్పినదానికి శంకరుడు సరే అన్నాడు. “ఇప్పటికే రేతస్థానము నుంచి నా తేజస్సు కదిలింది, ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు? దాన్ని ఎక్కడ వదిలిపెట్టను?” అని శంకరుడు అడిగాడు. అప్పుడు దేవతలు,

Ramayanam Story in Telugu – యత్ తేజః క్షుభితం హి అద్య తద్ ధరా ధారయిష్యతి
మీ తేజస్సుని భూమి భరిస్తుంది. భూమి మీద వదిలిపెట్టండి అని అన్నారు.శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిపెట్టాడు. వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది. ఇంతలో పార్వతీదేవి బయటకు వచ్చి, “నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు.” వ్యాపించిన ఆ శంకరుడి తేజస్సుని భూమి కూడా తట్టుకోలేకపోయింది. దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సుని తనయందు పెట్టుకోమన్నారు. అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు. శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోవడానికి పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడు.

కుమారస్వామి జననం

అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు తాను పార్వతీ పరమేశ్వరుల బిడ్డడి చేతిలోనే చనిపోయేటట్టు వరం పొందాడు. ఇది తెలిసిన దేవతలకి ఏమి చెయ్యాలో తెలియక బ్రహ్మగారి దగ్గరికి వెళ్లారు. బ్రహ్మగారు ఆలోచించి హిమవంతుడు, మనోరమల కుమార్తెలైన గంగా పార్వతులకి తేడా లేదు. పార్వతీదేవి అక్క అయిన గంగలో ఈ తేజస్సుని విడిచిపెడితే పార్వతీదేవికి కోపం రాదు. ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారు. దేవతలు గంగమ్మ దగ్గరికి వెళ్ళి దేవకార్య నిమిత్తము నువ్వు అగ్ని దగ్గరనుంచి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు. దేవతా కార్యము కనుక గంగ సరే అన్నది. గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది. శివతేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది. “ఈ తేజస్సుని నేను భరించలేను. నన్ను ఏమి చెయ్యమంటారు?” అని అడిగింది. అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద వదిలింది.

భూమి మీద పడ్డ తేజస్సు నుండి వివిధ పదార్థాల ఆవిర్భావం మరియు కార్తికేయుడి జననం గురించి క్రింది పట్టికలో సంగ్రహించవచ్చు:

తేజస్సు యొక్క భాగంఏర్పడిన పదార్థాలు
కాంతివంతమైన స్వరూపంబంగారం, వెండి
మలంతగరము, సీసము
క్షారంరాగి, ఇనుము
మిగిలిన పదార్థంమిగతా ధాతువులు (గనులుగా ఏర్పడ్డాయి)
ఇతర పరిణామాలుబంగారు పొదలు, శరవణ పొదలు
కార్తికేయుడి జననంతటాకం నుండి ఏడుపు, కృత్తికల పాలివ్వడం

ఈ పట్టిక తేజస్సు యొక్క వివిధ భాగాల నుండి ఏర్పడిన పదార్థాలను మరియు కార్తికేయుడి జననం యొక్క వివరాలను అందిస్తుంది.

తతః తు దేవతాః సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్
పుత్రః త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయః

అప్పుడు దేవతలందరూ “కార్తికేయుడు త్రైలోక్యాలలో ప్రసిద్ధి చెందుతాడు” అని అన్నారు.ఈ మాట విన్న కృత్తికలు ఆనందంగా పాలు పట్టారు. ఆ పుట్టిన పిల్లవాడు ఆరు ముఖములతో పుట్టాడు. ఏక కాలంలో ఆరుగురు కృత్తికల స్తన్యమునందు ఆరుముఖములతో పాలు తాగాడు కనుక ఆయనకి షడాననుడు, షణ్ముఖుడు అనే పేర్లు వచ్చాయి. అగ్నిదేవుడి నుండి బయటకి వచ్చిన శివ తేజస్సు కనుక ఆయనకి పావకి, అగ్నిసంభవః అని, పరమశివుడి కుమారుడు కనుక ఆయనని కుమారస్వామి అని పిలిచారు. శివుడి వీర్యము స్ఖలనమైతే పుట్టినవాడు కనుక స్కందుడు అని పిలిచారు. పార్వతీదేవిలా అందంగా ఉంటాడు. అమ్మ అందం వచ్చింది కనుక మురుగన్ అని పిలిచారు. పరమశివుడికి ప్రణవార్ధాన్ని వివరించాడు కనుక స్వామిమలై అన్నారు అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు.

భగీరథుడు గంగను భూమికి తీసుకురావడం

గంగ అసలు భూమి మీదకి ఎందుకు వచ్చిందో విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు: పూర్వం అయోధ్య నగరాన్ని మీ వంశానికి చెందిన సగరుడు పరిపాలించేవాడు. ఆయనకి కేశిని, సుమతి అని ఇద్దరు భార్యలు. సుమతి గరుత్మంతుడి సోదరి. తనకు కుమారులు కలగడం కోసం తన ఇద్దరు పత్నులతో కలిసి హిమాలయాలలో ఉన్న భృగు స్రవణాన్ని చేరుకొని నూరు సంవత్సరములు తపస్సు చేశాడు సగరుడు. ఆ భృగు స్రవణంలో ఉన్న భృగు మహర్షి సంతోషించి నీకున్న ఇద్దరు భార్యలలో ఒక భార్యకి వంశోద్ధారకుడైన కొడుకు పుడతాడు. రెండవ భార్యకి 60,000 మంది మహా ఉత్సాహవంతులైన కొడుకులు పుడతారని వరమిచ్చాడు.

భార్య పేరుపుట్టిన కొడుకులు
కేశినివంశోద్ధారకుడు
సుమతి60,000 మంది కుమారులు

కొంతకాలానికి పెద్ద భార్యకి అసమంజసుడు అనే వాడు పుట్టాడు. రెండవ భార్యకి ఒక సొరకాయ పుట్టి కిందపడి పగిలి అందులోంచి 60,000 మంది చిన్న చిన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళని నేతి కుండలలో పెట్టి పెంచారు, వాళ్ళందరిని కలిపి సగరులు అన్నారు. పెద్ద భార్య కొడుకైన అసమంజసుడు రోజూ రాజ్యంలోని కొంతమంది పిల్లలని సరయు నదిలోకి తీసుకెళ్ళి, నీళ్ళల్లో వదిలి వాళ్ళ మరణానికి కారణం అయ్యేవాడు. కొంతకాలానికి రాజుకి విషయం తెలిసి అసమంజసుడిని రాజ్యం నుంచి బహిష్కరించాడు. అతని కొడుకైన అంశుమంతుడిని తన దగ్గర పెట్టుకున్నాడు.

సగరుడు అశ్వమేథ యాగాన్ని ప్రారంభించి వదిలిన గుర్రము ఇంద్రుడు అపహరించాడు. ఆ గుర్రము వెనకాల వెళుతున్న అంశుమంతుడు ఈ విషయాన్ని సగరుడికి చెప్పాడు. అలా అశ్వం అపహరించబడితే దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ యాగం నిర్వహిస్తున్న పండితులు అన్నారు. అప్పుడా సగరుడు తన 60,000 మంది కొడుకులను పిలిచి ఈ భూమి 60,000 యోజనములు ఉంటుంది. మీరందరూ ఒక్కో యోజనము తవ్వండి. భూమి మొత్తాన్ని వెతకండని చెప్పి పంపాడు.

ఇది గమనించిన దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, “దేవా! సగరులు భూమిని తవ్వుతుంటే ప్రాణులన్నీ చనిపోతున్నాయి. ఏమి చెయ్యమంటారు?” అని అడిగారు. బ్రహ్మ దేవుడు “మీరు కంగారు పడకండి. ఈ భూమి శ్రీమహావిష్ణువుది. ఆయనే ఈ భూమిని రక్షించుకుంటాడు. ప్రస్తుతం ఆయన పాతాళ లోకంలో కపిలమహర్షిగా తపస్సు చేసుకుంటున్నారు” అని చెప్పారు.

సగరులకి ఎంత తవ్వినా అశ్వం కనబడకపోయేసరికి వాళ్ళు సగరుడికి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పారు. “నాకు గుర్రం తప్పకుండా కావాలి. మీరు పాతాళం దాకా తవ్వెయ్యండి” అని చెప్పి వాళ్ళని మళ్ళీ పంపాడు. వాళ్ళు అలా తవ్వుతుండగా దిక్కులను కాపాడుతున్న ఏనుగులు కనిపించాయి.

దిక్కుఏనుగు పేరు
తూర్పుదిశా గజం
దక్షిణంమహా పద్మం
పడమరసౌమనసం
ఉత్తరంభద్రము

ఈ సారి ఈశాన్యం వైపు తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వగా తవ్వగా వాళ్ళకి ఒక ఆశ్రమంలో సనాతనుడైన విష్ణు భగవానుడు కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటూ కనబడ్డాడు. ఆయన పక్కనే యాగాశ్వం కూడా ఉన్నది. ఆ సగరులు ఆయనే మన గుర్రాన్ని దొంగాలించాడని భావించి ఆయన్ని కొట్టడానికి పరుగుతీసారు. వెంటనే ఆ కపిల మహర్షి ఒక ‘హుం’కారం చేసేసరికి ఈ 60,000 మంది సగరులు నేల మీద బూడిదై పడ్డారు.

ఎంతకాలమైన సగరులు రాకపోయేసరికి ఆ సగరుడు అంశుమంతుడిని పిలిచి వెతకమన్నాడు. అంశుమంతుడు తన పినతండ్రులు తవ్విన మార్గం ద్వారా ప్రయాణించి కపిల మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. అక్కడున్న తన పినతండ్రుల భస్మాన్ని చూసి బాధపడ్డాడు. వాళ్ళకి ఉత్తర క్రియలు జరగలేదు కనుక నీళ్ళు తీసుకువద్దామని బయలుదేరగా ఆ సగరుల మేనమామ అయిన గరుత్మంతుడు ప్రత్యక్షమై ఈ భూమిలోని ఏ జలంతో జలతర్పణ ఇచ్చినా నీ పినతండ్రులు స్వర్గానికి వెళ్ళరు. వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలంటే కేవలం స్వర్గలోకంలో ప్రవహించే గంగా జలాలతో తర్పణ ఇవ్వాలి. గంగని భూమి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు.

గుర్రాన్ని తీసుకెళ్ళి యాగం పూర్తి చేశారు. తన కుమారులు కపిల మహర్షి ఆగ్రహానికి బూడిదయ్యారని విని సగరుడు చాలా బాధపడ్డాడు. ఆయన తరవాత అంశుమంతుడు రాజయ్యాడు. ఆయన 32,000 సంవత్సరాలు తపస్సు చేసి తపస్సులోనే శరీరం వదిలేశాడు. ఆయన తరవాత వచ్చిన దిలీపుడు 30,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు కాని గంగని తీసుకురాలేకపోయాడు. దిలీపుడి తరవాత వచ్చిన భగీరథుడు రాజ్యాన్ని మంత్రులకి అప్పజెప్పి, గోకర్ణ క్షేత్రంలో 1000 సంవత్సరాలు తపస్సు చేయగా, ఆయనకి బ్రహ్మదేవుడు దర్శనం ఇచ్చాడు. భగీరథుడు “నాకు కుమారులు లేరు. మా వంశం ఆగకుండా ఉండడానికి నాకు కుమారులు కలిగేలా వరమివ్వు. అలాగే మా పితృదేవతలు స్వర్గానికి వెళ్ళడం కోసం సురగంగని భూమి మీదకి పంపించు” అన్నాడు.

బ్రహ్మదేవుడు “నీ మొదటి కోరికని నేను తీరుస్తాను, కాని గంగని భూమి మీదకి వదిలితే దాన్ని కేవలం శివుడు తప్ప పట్టగలిగేవాడు ఎవడు లేడు. నీవు శివుని గూర్చి తపస్సు చెయ్యి. ఆయన ఒప్పుకుంటే అప్పుడు గంగని వదులుతాను” అని అన్నాడు.

https://shorturl.at/egH04 

https://youtu.be/bqDv7hjsgN8 

bakthivahini

Share
Published by
bakthivahini

Recent Posts

Bhagavad Gita Chapter 10 Verse 8 | భగవద్గీత 10వ అధ్యాయం 8వ శ్లోకం

Bhagavad Gita Chapter 10 Verse 8 ప్రతిరోజూ ఉదయం లేచి, మనం ఎన్నో కలలతో, ఆశలతో రోజును ప్రారంభిస్తాం.…

16 hours ago

Bhagavad Gita Chapter 10 Verse 7 | భగవద్గీత 10వ అధ్యాయం 7వ శ్లోకం

Bhagavad Gita Chapter 10 Verse 7 ఈ రోజుల్లో చాలా మంది ఉదయం లేవగానే ఒక రకమైన అలసటతో…

2 days ago

Bhagavad Gita Chapter 10 Verse 6 | భగవద్గీత 10వ అధ్యాయం 6వ శ్లోకం

Bhagavad Gita Chapter 10 Verse 6 ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య – "అసలు నేనెవరిని?…

3 days ago

Bhagavad Gita Chapter 10 Verse 4 & 5 | భగవద్గీత 10వ అధ్యాయం 4 & 5వ శ్లోకం

Bhagavad Gita Chapter 10 Verse 4 & 5 ఈ రోజుల్లో చాలా మందిని పట్టి పీడిస్తున్న ఒకే…

2 weeks ago

Bhagavad Gita Chapter 10 Verse 3 | భగవద్గీత 10వ అధ్యాయం 3వ శ్లోకం

Bhagavad Gita Chapter 10 Verse 3 మనలో చాలామంది రాత్రి పడుకునే ముందు ఒకే ఆలోచనతో సతమతమవుతుంటారు. "ఈరోజు…

2 weeks ago

Bhagavad Gita Chapter 10 Verse 2 | భగవద్గీత 10వ అధ్యాయం 2వ శ్లోకం

Bhagavad Gita Chapter 10 Verse 2 మనలో చాలా మంది జీవితం... బయట ప్రపంచంతో యుద్ధం చేయడం కంటే,…

2 weeks ago