Shukra Beeja Mantra
సంకల్పం
అద్య పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ, మమ శుక్ర గ్రహ పీడా పరిహారార్థం, శుక్ర ప్రసాద ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాది ఉత్తమ ఫలావాప్త్యర్థం, మమ సంకల్పిత మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం, యథా సంఖ్యాకం శుక్ర గ్రహస్య బీజమంత్ర జపం కరిష్యే.
ధ్యానం
- శ్వేతాంబరః శ్వేతవపుః కిరీటీ
- చతుర్భుజో దైత్యగురుః ప్రశాంతః
- తథాసి దండం చ కమండలుం చ
- తథాక్షసూత్రాద్వరదోఽస్తు మహ్యమ్
హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుమ్ సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్
పంచోపచార పూజ
- లం పృథివ్యాత్మనే గంధం పరికల్పయామి
- హం ఆకాశాత్మనే పుష్పం పరికల్పయామి
- యం వాయ్వాత్మనే ధూపం పరికల్పయామి
- రం అగ్న్యాత్మనే దీపం పరికల్పయామి
- వం అమృతాత్మనే నైవేద్యం పరికల్పయామి
- సం సర్వాత్మనే సర్వోపచారాన్ పరికల్పయామి
బీజమంత్రం
ఓం ద్రాం ద్రీం ద్రౌం సః శుక్రాయ నమః
సమర్పణం
గుహ్యాతి గుహ్య గోప్తా త్వం గృహాణాస్మత్కృతం జపమ్ సిద్ధిర్భవతు మే దేవ త్వత్ప్రసాదాన్మయి స్థిరా అనేన మయా కృత శుక్ర గ్రహస్య మంత్ర జపేన, శుక్ర సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు.
ఓం శాంతిః శాంతిః శాంతిః
శుక్ర గ్రహ దోష నివారణకు, ఐశ్వర్య వృద్ధికి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించవచ్చు.
భావం
ధ్యానం
తెల్లని వస్త్రాలు ధరించినవాడు, తెల్లని శరీరం కలవాడు, కిరీటధారి, నాలుగు భుజములు కలవాడు, రాక్షసులకు గురువు, ప్రశాంతమైనవాడు – అలాంటి శుక్రుడు నాకు అసి, దండం, కమండలం, అక్షసూత్రాన్ని ధరించి వరాలిచ్చు గాక. మంచు, మల్లెపువ్వులు, తామర కాడ వలె తెల్లగా ఉన్నవాడు, రాక్షసులకు గొప్ప గురువు, సకల శాస్త్రాలను బోధించినవాడు అయిన భార్గవునికి నేను నమస్కరిస్తున్నాను.
పంచోపచార పూజ
‘లం’ అనే బీజాక్షరంతో పృథివీ స్వరూపుడైన శుక్రునికి గంధాన్ని సమర్పిస్తున్నాను. ‘హం’ అనే బీజాక్షరంతో ఆకాశ స్వరూపుడైన శుక్రునికి పుష్పాన్ని సమర్పిస్తున్నాను. ‘యం’ అనే బీజాక్షరంతో వాయు స్వరూపుడైన శుక్రునికి ధూపాన్ని సమర్పిస్తున్నాను. ‘రం’ అనే బీజాక్షరంతో అగ్ని స్వరూపుడైన శుక్రునికి దీపాన్ని సమర్పిస్తున్నాను. ‘వం’ అనే బీజాక్షరంతో అమృత స్వరూపుడైన శుక్రునికి నైవేద్యాన్ని సమర్పిస్తున్నాను. ‘సం’ అనే బీజాక్షరంతో సర్వాత్మ స్వరూపుడైన శుక్రునికి సమస్త ఉపచారాలను సమర్పిస్తున్నాను.
బీజమంత్రం
ఓం ద్రాం ద్రీం ద్రౌం సః శుక్రాయ నమః.
సమర్పణం
ఓ దేవ దేవా! గోప్యం చేయదగిన వాటిని కూడా గోప్యం చేసేవాడవు నీవే. నాచే చేయబడిన ఈ జపాన్ని స్వీకరించుము. నీ అనుగ్రహం వలన నాకు స్థిరమైన సిద్ధి కలుగుగాక. నాచే చేయబడిన ఈ శుక్ర గ్రహ మంత్ర జపం ద్వారా శుక్రుడు అత్యంత ప్రీతి చెంది, ప్రసన్నుడై, వరాలను ప్రసాదించుగాక. ఓం శాంతిః శాంతిః శాంతిః.
శుక్ర గ్రహ దోష నివారణకు, ఐశ్వర్య వృద్ధికి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించవచ్చు.