Rama Nama Sankeerthanam
శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము
రామనామము రామనామము రమ్యమైనది రామనామము!!
శ్రీమదఖిల రహస్యమంత్ర విశేషధామము రామనామము!!రామ!!
దారినొంటిగ నడుచువారికి తోడునీడే రామనామము!!రామ!!
నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము!!రామ!!
కోరి కొలచిన వారికెల్లను కొంగుబంగరు రామనామము!!రామ!!
పాహి కృష్ణాయనుచు ద్రౌపది పలికినది శ్రీరామనామము!!రామ!!
ఆలుబిడ్డల సౌఖ్యమునకన్న అధికమైనది రామనామము!!రామ!!
నీవు నేనను భేదమేమియు లేక యున్నది రామనామము!!రామ!!
ఇడాపింగళ మధ్యమందున యిమిడియున్నది రామనామము!!రామ!!
అండపిండ బ్రహ్మాండముల కాధారమైనది రామనామము!!రామ!!
గౌరికిది యుపదేశనామము కమలజుడు జపియించు నామము!!రామ!!
గోచరంబగు జగములోపల గోప్యమైనది రామనామము!!రామ!!
బ్రహ్మసత్యము జగన్మిథ్యా భావమే శ్రీరామనామము!!రామ!!
వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము!!రామ!!
భక్తితో భజియించువారికి ముక్తినొసగును రామనామము!!రామ!!
భగవదర్పిత కర్మపరులకు పట్టుబడు శ్రీరామనామము!!
ఆదిమధ్యాంతాది రహిత యనాదిసిద్ధము రామనామము!!రామ!!
సకలజీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము!!రామ!!
జన్మమృత్యు జరాదివ్యాధుల జక్కబరచును రామనామము!!రామ!!
ద్వేషరాగ లోభమోహములను ద్రెంచునది శ్రీరామనామము!!రామ!!
ఆంజనేయుని వంటి భక్తుల కాశ్రయము రామనామము!!రామ!!
సృష్టిస్థితిలయ కారణంబగు సూక్ష్మరూపము రామనామము!!రామ!!
శిష్టజనముల దివ్యద్రుష్టికి స్పష్టమగు శ్రీరామనామము!!రామ!!
సాంఖ్య మెరిగెడి తత్వవిదులకు సాధనము శ్రీరామనామము!!రామ!!
యుద్ధమందు మహోగ్రరాక్షస యాగధ్వంసము రామనామము!!రామ!!
రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము!!రామ!!
ఆత్మసంయమయోగ సిద్ధికి ఆయుధము రామనామము!!రామ!!
నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీ రామనామము!!రామ!!
కోటిజన్మల పాపమెల్లను రూపుమాపును శ్రీరామనామము!!రామ!!
సత్వరజస్తమోగుణముల కతీతమైనది శ్రీరామనామము!!రామ!!
ఆగామి సంచిత ప్రారబ్ధములను హరియించునది శ్రీరామనామము!!రామ!!
కామక్రోధ లోభ మోహములను కాల్చునది శ్రీ రామనామము!!రామ!!
ఆశ విడచిన తృప్తులకు ఆనందమొసగును శ్రీరామనామము!!రామ!!
ప్రణవమను “ఓం”కారనాద బ్రహ్మమే శ్రీ రామనామము!!రామ!!
మనసు స్థిరముగ నిలయగలిగెడి మంత్రరాజము శ్రీరామనామము!!రామ!!
జన్మమృత్యు రహస్యమెరిగి జపించవలె శ్రీరామనామము!!రామ!!
విశయవాసనలెల్ల విడచిన విదితమగు శ్రీరామనామము!!రామ!!
పసితనంబున నభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము!!రామ!!
సర్వమతములలోన తత్వసారమే శ్రీరామనామము!!రామ!!
నిర్మలంబుగు శోధచేసిన నేర్వదగు శ్రీరామనామము!!రామ!!
విజ్ఞుడగు గురునాశ్రయించిన విశదమగు శ్రీరామనామము!!రామ!!
జీవితంబున నిత్యజపమున చేయవలె శ్రీ రామనామము!!రామ!!
మరణకాలమందు ముక్తికి మార్గమగు శ్రీ రామనామము!!రామ!!
పాలుమీగడ పంచదారల పక్వమే శ్రీరామనామము!!రామ!!
ఎందరో మహానుభావుల డెందమాయెను శ్రీ రామనామము!!రామ!!
తుంటరీ కామాదులను మంటగలుపునది శ్రీ రామనామము!!రామ!!
మేరుగిరి శిఖరాగ్రముందున మెరయుచున్నది శ్రీరామనామము!!రామ!!
సిద్ధమూర్తులు మాటిమాటికి చేయునది శ్రీరామనామము!!రామ!!
వెంటతిరిగెడి వారికెల్లను కంటిపాపే శ్రీ రామనామము!!రామ!!
ముదముతో సద్భక్తిపరులకు మూలమంత్రము శ్రీరామనామము!!రామ!!
కుండలిని భేధించి చూచిన పండువెన్నెల శ్రీరామనామము!!రామ!!
గరుడగమనదులకైన కడు జ్రమ్యమైనది శ్రీరామనామము!!రామ!!
ధాతవ్రాసిన వ్రాతతుడిచెడి దైవమే శ్రీరామనామము!!రామ!!
పుట్టతానై పాముతానై బుస్సుకొట్టును శ్రీరామనామము!!రామ!!
అష్ట దళముల కమలమందున నమరియున్నది శ్రీరామనామము!!రామ!!
అచలమై ఆనందమై పరమాణువైనది శ్రీరామనామము!!రామ!!
జపతపంబుల కర్హమైనది జగతిలో శ్రీరామనామము!!రామ!!
జ్ఞానభూముల నేడు గడిచిన మౌనదేశము శ్రీరామనామము!!రామ!!
తత్త్వశిఖరముందు వెలిగేనిత్యసత్యము శ్రీరామనామము!!రామ!!
దట్టమైన గాఢాంధకారమును రూపుమాపును శ్రీరామనామము!!రామ!!
పంచభూతాతీతమగు పరమాత్మ తత్త్వము శ్రీరామనామము!!రామ!!
పండువెన్నెల కాంతిగలిగిన బ్రహ్మనాదము శ్రీరామనామము!!రామ!!
నిజస్వరూపము బోధకంబుగు తారకము శ్రీరామనామము!!రామ!!
రజతగిరి పతికినెప్పుడు రమ్యమైనది శ్రీరామనామము!!రామ!!
శివుడు గౌరికి బోధచేసిన చిన్మయము శ్రీరామనామము!!రామ!!
సకల సద్గుణ నిలయమగు పరిపూర్ణతత్త్వమే శ్రీరామనామము!!రామ!!
అంబరీషుని పూజలకు కైవల్యమొసగిన శ్రీరామనామము!!రామ!!
అల కుచేలుని చేతి అటుఉల నారగించిన శ్రీరామనామము!!రామ!!
ఆత్మలో జీవాత్మ తానై అలరుచున్నది శ్రీరామనామము!!రామ!!
ఆత్మతపమును సల్పువారికి ఆత్మయజ్ఞము శ్రీరామనామము!!రామ!!
కర్మ నేత్ర ద్వయము చేతను కానరానిది శ్రీరామనామము!!రా
జానకీ హృత్కమలమందున నలరుచున్నది శ్రీరామనామము!!రామ!!
చిత్తశాంతిని కలుగజేసెడి చిత్స్వరూపము శ్రీరామనామము!!రామ!!
చావుపుట్టుకలు లేని పరమపదమై వెలయుచున్నది శ్రీరామనామము!!రామ!!
ముక్తి రుక్మాంగదున కొసగిన మూలమంత్రము శ్రీరామనామము!!రామ!!
మూడు నదులను దాటువారికి మోక్షలక్ష్మియే శ్రీరామనామము!!రామ!!
మోహమను మంత్రార్థవిదులకు సోమపానము శ్రీరామనామము!!రామ!!
చూపు మానస మొక్కటై చూడవలసినది శ్రీరామనామము!!రామ!!
త్రిపుటమధ్యమునందు వెలిగే జ్ఞానజ్యోతియే శ్రీరామనామము!!రామ!!
దూరదృష్టియు లేనివారికి దుర్లభము శ్రీరామనామము!!రామ!!
బంధరహిత విముక్తి పథమగు మూలమంత్రము శ్రీరామనామము!!రామ!!
బ్రహ్మపుత్ర కరాబ్జవీణా పక్షమైనది శ్రీరామనామము!!రామ!!
భక్తితో ప్రహ్లాదుడడిగిన వరమునొసగెను శ్రీరామనామము!!రామ!!
నీలమేఘశ్యామలము నిర్మలము శ్రీరామనామము!!రామ!!
ఎందుజూచిన ఏకమై తావెలయుచున్నది శ్రీరామనామము!!రామ!!
రావణానుజ హృదయపంకజ రాచకీరము శ్రీరామనామము!!రామ!!
రామతత్త్వము నెరుగువారికి ముక్తితత్త్వము శ్రీరామనామము!!రామ!!
వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది శ్రీరామనామము!!రామ!!
శరణు శరణు విభీషణునకు శరణమొసగిన శ్రీరామనామము!!రామ!!
శాంతి, సత్య, అహింస సమ్మేళనమే శ్రీరామనామము!!రామ!!
సోమసూర్యాదులను మించిన స్వప్రకాశము రామనామము!!రామ!!
సోహ మను మంత్రార్థవిదుల దోహముక్తియే శ్రీరామనామము!!రామ!!
ఉపనిషద్వాక్యముల చేతనే యొప్పుచిన్నది శ్రీరామనామము!!రామ!!
దాసులను రక్షించ దయగల ధర్మనామము శ్రీరామనామము!!రామ!!
నాదమే బ్రహ్మాండమంతయు నావరించును శ్రీరామనామము!!రామ!!
రాక్షసులను తరిమికొట్టిన నామమే శ్రీరామనామము!!రామ!!
మోక్షమివ్వగ కర్తతానై మ్రోగుచున్నది శ్రీరామనామము!!రామ!!
శాంతిగా ప్రార్థించువారికి సౌఖ్యమైనది శ్రీరామనామము!!రామ!!
రామనామ స్మరణ చేసిన క్షేమమొసగును శ్రీరామనామము!!రామ!!
పెద్దలను ప్రేమించువారికి ప్రేమనిచ్చును శ్రీరామనామము!!రామ!!
ఆత్మశుద్ధిని గన్నవారికి అధికమధురము శ్రీరామనామము!!రామ!!
గుట్టుగా గురుసేవచేసిన గుణములొసగును శ్రీరామనామము!!రామ!!
బ్రహ్మవిష్ణు మహేశ్వరులకు నిష్టమైనది శ్రీరామనామము!!రామ!!
పరమపదము చేరుటకు దారిచూపునది శ్రీరామనామము!!రామ!!
తల్లివలె రక్షించు సుజనుల నెల్లకాలము శ్రీరామనామము!!రామ!!
రామనామము రామనామము రమ్యమైనది రామనామము!!రామ!!
జ్ఞానులకు ఆత్మానుభవజ్ఞానమే శ్రీరామనామము!!రామ!!
మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము!!రామ!!
భయహర మంగళ దశరథ రామ
జయ జయ మంగళ సీతా రామ
మంగళకర జయ మంగళ రామ
సంగతశుభవిభవోదయ రామ
ఆనందామృతవర్షక రామ
ఆశ్రితవత్సల జయ జయ రామ
రఘుపతి రాఘవ రాజా రామ
పతితపావన సీతారామ
రామ రామ జయ రాజారామ
రామ రామ జయ సీతారామ
హరిః ఓం తత్సత్
॥ ఇతి శ్రీనామ రామాయణము ॥