Venkateswara Swamy Katha- శ్రీమన్నారాయణుడు తిరిగి తిరిగి అలసిపోయాడు. శరీరంలోని శక్తి తగ్గిపోయింది. ఇక ఏమాత్రం ప్రయాణం సాగించలేని స్థితిలో ఉండగా శేషాద్రి చేరుకున్నాడు. అక్కడొక చింతచెట్టు కింద కూర్చున్నాడు. బాగా అలసిపోయిన శ్రీహరి ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలో ఆలోచించి, అక్కడకు దగ్గరగా ఒక వల్మీకం కనబడగా ఎవరికీ కనబడకుండా ఉండవచ్చునని అందులో ప్రవేశించాడు. అదే అతనికి వైకుంఠం. తిండీ నిద్రా లేకనే రోజులు గడిచిపోతున్నాయి. నారదుడు దివ్యదృష్టితో నారాయణుడి అవస్థను అర్థం చేసుకుని సత్యలోకంలో బ్రహ్మనూ, కైలాసంలో శివుణ్ణి కలిసి విషయమంతా విన్నవించగా, శ్రీహరి ఆకలి తీర్చడానికి బ్రహ్మ ఆవు రూపంలోనూ, ఈశ్వరుడు దూడ రూపంలోనూ భూలోకానికి చేరాలని అనుకున్నారు.
శ్రీలక్ష్మి కూడా భూలోకంలో కొల్లాపురంలో తపస్సు చేసుకుంటుందని తెలుసుకుని ఆమెను దర్శించి శ్రీహరి అవస్థ చెప్పగా విని లక్ష్మి కంటతడి పెట్టింది. “అమ్మా, జరిగినదానికి విచారిస్తూ ఉండేకన్నా, దానికి తరుణోపాయం ఆలోచించాలి. అందుకు మాకు తోచిన సలహా ఏమంటే మేమిద్దరం ఆవుదూడలుగా మారగలము. నీవు గొల్లకన్యగా మారి మమ్ములను తోలుకుని పోయి చోళరాజుకు అమ్మము. మేము మేతకు వెళ్ళినప్పుడు శ్రీహరి ఆకలి తీర్చడానికి పాలు ఇవ్వగలము. కాబట్టి మా కోరిక మన్నించి నీవు గొల్లభామ రూపం దాల్చవమ్మా” అన్నారు. నాథుని ఆకలి తీర్చడానికి ఇది చక్కని ఆలోచన అని సంతోషించి లక్ష్మి గొల్లభామగా మారగా, బ్రహ్మ ఆవుగానూ, ఈశ్వరుడు లేగదూడగానూ మారిపోయారు. లక్ష్మీదేవి వాటిని తోలుకుని చోళరాజు వద్దకు వెళ్ళగా వాటి అందం, శాంతం, సాధుత్వం చూసి రాజుగారి పట్టపుదేవి భర్తతో ఎలాగైనా ఆ ఆవుదూడలను కొనాలని వేడుకోగా, రాజు కూడా సంతోషించి బేరమాడి వాటిని కొన్నాడు.
చోళరాజుకు అంతకుముందే పెద్ద ఆవుల మంద ఉంది. పశువుల కాపరులూ ఉన్నారు. ఆ మందలో ఈ ఆవుదూడలను కలిపారు. ప్రతిరోజూ అడవికి తోలుకుని పోయి, తిరిగి సాయంత్రం ఇంటికి తీసుకురావడం పశువుల కాపరుల పని. ఇలా ప్రతిరోజూ జరుగుతూనే ఉంది. కానీ ఆవు కడుపునిండా మేసి సాయంత్రం ఇంటిముఖం పట్టేముందు శ్రీహరి విశ్రమిస్తున్న పుట్టపైకి ఎక్కి తన పొదుగులోని పాలను పుట్ట రంధ్రం గుండా శ్రీహరి నోట్లో పడేలా చేస్తోంది. ఇలా రోజులు గడుస్తున్నాయి. సాయంత్రం ఆవుపాలు పిండగా పాలు రావడం లేదు. ఈ సంగతి రాణి రాజుతో చెప్పింది. రాజుకు పశువుల కాపరిపై కోపం, అనుమానం కలిగి, “ఓరి నా ఆవుపాలను పితికి తాగుతున్నావా? కొన్న ముహూర్తం ఎలాంటిదో కానీ, ఒక్కరోజు కూడా ఆ ఆవుపాలను కంటితో చూడలేదే!” అని గద్దించాడు.
పశువుల కాపరికి కూడా అనుమానం కలిగింది. ఇదేదో మాయగా ఉంది. దీన్ని జాగ్రత్తగా పరిశీలించాలి అని మనస్సులో ఆలోచించి యథాప్రకారం ఆవులను మేతకు తోలుకుని వెళ్ళాడు. ఈ ఆవు మేత మేసి దూడతో సహా మందలో నుండి విడిపోయి పుట్టవద్దకు వచ్చి తన చిక్కటి పాలను పుట్టలోనికి పడేలా చేసింది. ఆ దృశ్యాన్ని చూసి పశువుల కాపరికి పట్టరాని కోపం వచ్చి, దీనివల్లనే కదా నాకు అపవాదు వచ్చింది. ఇది ఇలాగ పాలను పుట్టలోనికి వృథా చేస్తోంది. దీనికి తగిన ప్రాయశ్చిత్తం చేయాలి అని చేతిలోని గొడ్డలితో ఆవును కొట్టబోయాడు. తన కుపకారం చేసే గోమాతను కొడతాడా అని తలచి శ్రీహరి పుట్టలో నుంచి బయటకు తల ఎత్తి గోవుకు అడ్డురాగా, పశువుల కాపరి కొట్టిన దెబ్బ శ్రీహరి తలకు బలంగా తగిలింది. రక్తం ధారగా కారిపోతోంది. ఆ రక్తధారను చూసి పశువుల కాపరికి కళ్ళుతిరిగి మూర్ఛపోయాడు. ఆ ఆవు “అంబా” “అంబా” అని గోలపెట్టి శేషాచల పర్వతం దిగి చోళరాజు ఇంటికి వచ్చింది. దాని కళ్ళ వెంట ఏకధారగా కారుతున్న కన్నీటిని చూసి రాజు ఆశ్చర్యపోయి మరొక పశువుల కాపరిని పిలిచి “ఎందుకు ఇలా కన్నీరు కారుస్తోందో దీని వెంట వెళ్ళి విషయం తెలుసుకో”మని అడవికి పంపించాడు. ఆ పశువుల కాపరి మూర్ఛపోయి ఉన్నాడు. వచ్చినవానికి కూడా ఆశ్చర్యం కలిగి పరుగుపరుగున వచ్చి తాను చూసిన దృశ్యాలను రాజుకు చెప్పాడు. రాజు ఆశ్చర్యపోయి తాను కూడా కళ్ళారా చూడాలని గొల్లవానితో శేషాచల పర్వతంపైకి వెళ్ళి చూడగా పుట్టలో నుంచి శ్రీహరి బయటకు వచ్చి, “ఓరీ మదాంధా! నన్ను నీ గోపాలునితో కొట్టించావా? ఎంత పొగరుతో ఉన్నావు? నీ అనుచరునిచే నా తల పగులగొట్టించింది చాలక నన్ను వెక్కిరించడానికి చూడవచ్చావా? ఇదిగో నిన్ను శపిస్తున్నాను. నీవు రాక్షస రూపం ఎత్తుదువు గాక!” అని శపించగా రాజు వణుకుతూ “ప్రభూ” అని శ్రీహరి పాదాలపై ఒరిగిపోయాడు.
“స్వామీ! నాకు ఏ సంగతీ తెలియదు. నేనే పాపం ఎరుగను స్వామీ! నన్నెందుకు రాక్షసుడిగా శపించారు? నాకు ఈ రాక్షస రూపం ఎలా పోతుంది? మీరు ఈ పుట్టలో ఉండడానికి కారణం ఏమిటి?” అని దీనంగా ప్రార్థించాడు. భగవంతుడు కరుణామయుడు. “రాజా! నేను అన్న మాటకు తిరుగులేదు. అలా జరిగితీరాలి. కానీ, నీకు శాపవిమోచనం ఎప్పుడు కలుగుతుందంటే త్వరలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిదేవితో నాకు వివాహం అవుతుంది. ఆ వివాహ వేడుక నువ్వు చూసిన వెంటనే రాక్షసరూపం వదిలి నిజరూపం దాలుస్తావు. అంతవరకూ నువ్వు రాక్షసరూపంతోనే ఉంటావు” అని శ్రీహరి దీవించాడు. “చిత్తం ప్రభూ” అని స్వామికి నమస్కరించి రాక్షసరూపంతో చోళరాజు వెళ్ళిపోయాడు. అనంతరం అచ్యుతుడు, స్పృహ కోల్పోయి ఉన్న ఆ గొల్లవానికి తెలివి వచ్చేలా చేసి, ఆవుల మందతో పంపించాడు.
| సంఘటన | వివరణ |
|---|---|
| పశువుల కాపరి మూర్ఛ | గోమాతను కొట్టడం చూసిన తరువాత కోపంతో చెయ్యి చేసుకోవడం. |
| రాజు విచారణ | రాజు స్వయంగా వేషధారణలో వచ్చి తన కళ్ళారా దృశ్యం చూడటం. |
| విష్ణుమూర్తి శాపం | రాజును రాక్షస రూపం ఎత్తేలా శపించడం. |
| అంశం | వివరాలు |
|---|---|
| రాజు పేరు | చోళ రాజు |
| శాపం | రాక్షస రూపం |
| శాపానికి కారణం | పశువుల కాపరి శ్రీహరి తలకు గొడ్డలితో కొట్టడం |
| శాపవిమోచనం | పద్మావతీదేవి వివాహాన్ని చూడటం |
| దీవెన | పద్మావతీదేవి వివాహాన్ని చూసిన వెంటనే నిజరూపం పొందుతాడు |
ఈ కథ ద్వారా భక్తి, విధేయత, దైవకృప లాంటి విషయాలు స్పష్టంగా వెల్లడవుతాయి. ఇక్కడ శ్రీవెంకటేశ్వరుని కథలోని ప్రాముఖ్యత మరియు వైకుంఠాధిపతిగా ఆయన ఎలా నిలిచారనేదానికీ వివరణగా ఉంటుంది.
Bhagavad Gita 700 Slokas in Telugu మనిషి జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం తీసుకునే ప్రతి…
Karthika Puranam Telugu జలంధరుని యుద్ధ సన్నాహాలు ఓ పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని…
Karthika Puranam Telugu మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తూన్న జలంధరునికి భయపడినవారై దేవతలంతా విష్ణు స్తోత్రం…
Karthika Puranam Telugu తులసి మహాత్మ్యంపై పృధు చక్రవర్తి ప్రశ్న పృధు చక్రవర్తి నారదుడిని అడుగుతున్నాడు: 'దేవర్షీ! తులసిని స్థాపించి,…
Karthika Puranam Telugu నారదుడు చెబుతున్నాడు: ఓ పృథు భూపాలా! కార్తీక వ్రతం పాటించే పురుషుడు తప్పకుండా ఆచరించవలసిన నియమాలను…
Karthika Puranam Telugu నారదుడు చెప్పినదంతా విన్న పృథువు 'ఓ దేవర్షీ! కార్తీక మాసపు గొప్పదనమును వివరించి, నన్ను ధన్యుని…