Ramayanam Story in Telugu – రామాయణం 6

విశ్వామిత్రునితో రామలక్ష్మణుల ప్రయాణం

Ramayanam Story in Telugu- ప్రారంభం

  • విశ్వామిత్రుని వెనక రాముడు, లక్ష్మణుడు కోదండములు పట్టుకుని వెళుతున్నారు.
  • వాల్మీకి మహర్షి వారిని బ్రహ్మగారు అశ్విని దేవతలతో వెళితే ఎలా ఉంటుందో, స్థాణువైన శివుడి వెనకాల విశాఖుడు, స్కందుడు వెళితే ఎలా ఉంటుందో అలా రామలక్ష్మణులు వెళుతున్నారని పోల్చారు.
  • వారు సరయు నది దక్షిణ తీరంలో ఒకటిన్నర యోజనములు కాలినడకన ప్రయాణించి, చీకటి పడటం వల్ల ఒక ప్రాంతంలో విశ్రమించారు.
  • Ramayanam Story in Telugu

బల, అతిబల మంత్రోపదేశం

  • విశ్వామిత్రుడు రాముడికి బల, అతిబల అనే రెండు మంత్రములను ఉపదేశించాడు.
  • ఈ రెండు విద్యల వల్ల ఆకలి, దప్పిక కలగవు.
  • నిద్రపోతున్నప్పుడు కాని, నిద్రపోనప్పుడు కాని రాక్షసులు ఏమి చెయ్యలేరు.
  • దీనితో పాటు సమయస్పూర్తి, జ్ఞాపక శక్తి, బుద్ధి ప్రకాశిస్తాయి.
  • రాముడు లక్ష్మణుడికి ఆ మంత్రములను ఉపదేశించాడు.

రాత్రి విశ్రాంతి

  • విశ్వామిత్రుడు దర్భగడ్డి పరిచి ఇద్దరినీ దాని మీద పడుకోమన్నాడు.
  • రామలక్ష్మణులు హాయిగా నిద్రపోయారు.

ఉదయ సంధ్యావందనం

  • విశ్వామిత్రుడు తెల్లవారగానే లేచి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకొని రామలక్ష్మణులను నిద్రలేపాడు.
  • కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అని రాముడిని మేల్కొలిపాడు.
  • రామలక్ష్మణులు నిద్ర లేచి చెయ్యవలసిన కార్యక్రమాలు పూర్తి చేశారు.
  • 🌐 https://bakthivahini.com/

గంగా-సరయు సంగమ స్థానం

  • వారు గంగ-సరయు సంగమ స్థానం దాక వెళ్లారు.
  • అక్కడ ఒక ఆశ్రమాన్ని చూసి, అది ఎవరిదని రాముడు అడిగితే విశ్వామిత్రుడు “ఒకానొకప్పుడు పరమశివుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా మన్మధుడు బాణ ప్రయోగం చెయ్యబోతే, శివుడు తన మూడవ కంటితో మన్మధుడిని భస్మం చేసిన ప్రదేశము. మన్మధుడి అంగములన్ని కాలి బూడిదైన ఈ ప్రాంతాన్ని అంగదేశం అని పిలుస్తారు. ఆనాడు శంకరుడు తపస్సు చేసినప్పుడు ఆయనకి కొంతమంది శిష్యులున్నారు. శంకరుడితో ప్రత్యక్ష శిష్యరికం చేసినవాళ్ళ దగ్గరినుంచి ఈనాటి వరకు ఉన్న వీళ్ళందరూ పాపము లేనివాళ్ళు. రామా! ఈ రాత్రికి వీళ్ళందరితో కలిసి పడుకో ” అని చెప్పాడు.

గంగానది దాటడం

  • మరుసటి రోజున ఆ ఆశ్రమంలో ఉన్న మహర్షులు గంగా నదిని దాటడానికి పడవ ఏర్పాటు చేశారు.
  • పడవ గంగానదిలో వెళుతుండగా ఒక చోట గట్టిగా ధ్వని వినిపించింది.
  • రాముడు ఆ ధ్వని గురించి విశ్వామిత్రుడిని అడిగితే, ఆయన అది సరయూనది గంగానదితో సంగమించే ప్రదేశమని వివరించాడు.

తాటకి వృత్తాంతం

  • అవతలి ఒడ్డుకు చేరాక వారు అరణ్య మార్గంలో ప్రయాణించారు.
  • అక్కడ ఈల పక్షులు భయంకరమైన శబ్దములు చేస్తున్నాయి.
  • పులులు, సింహాలు, ఏనుగులు తిరుగుతున్నాయి.
  • ఈ అరణ్యం ఇంత భయంకరంగా ఎందుకుందని రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని అడగగా, ఆయన పూర్వము ఇక్కడ మలదము, కరూషము అని రెండు జనపదాలు ఉండేవని, తాటక అనే రాక్షసి వల్ల అవి నాశనమయ్యాయని చెప్పాడు.
  • సుకేతు అనే యక్షుడి కూతురైన తాటక, సుందుడిని వివాహం చేసుకుని మారీచుడిని కన్నది.
  • అగస్త్య మహర్షి శాపం వల్ల ఆమె రాక్షసిగా మారి, ఆ ప్రాంతాన్ని నాశనం చేసింది.

తాటకి సంహారం

  • విశ్వామిత్రుడు రాముడిని తాటకిని సంహరించమని ఆదేశించాడు.
  • రాముడు తన ధనుస్సుతో ధనుష్టంకారం చేసి తాటకిని యుద్ధానికి ఆహ్వానించాడు.
  • తాటకి రాళ్ల వర్షం కురిపించింది.
  • రాముడు ఆమె కాళ్ళు, చేతులు, లక్ష్మణుడు ముక్కు, చెవులు నరికారు.
  • చివరికి రాముడు బాణంతో ఆమెను సంహరించాడు.

దివ్యాస్త్రాల ఉపదేశం

  • దేవతలు విశ్వామిత్రుడిని రాముడికి దివ్యాస్త్రాలను ఉపదేశించమని కోరారు.
  • విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు అనేక అస్త్ర-శస్త్రాలను, వాటి ఉపసంహార మంత్రాలను ఉపదేశించాడు.

సిద్ధాశ్రమం

  • వారు ఒక ఆశ్రమానికి చేరుకున్నారు, అది వామనమూర్తి తపస్సు చేసిన సిద్ధాశ్రమం.
  • విశ్వామిత్రుడు అక్కడ యాగం ప్రారంభించాడు.

యాగ సంరక్షణ

  • మారీచుడు, సుబాహుడు రాక్షసులతో కలిసి యాగం ధ్వంసం చేయడానికి వచ్చారు.
  • రాముడు మారీచుడిని మానవాస్త్రంతో, సుబాహుడిని ఆగ్నేయాస్త్రంతో సంహరించాడు.
  • రాముడు ఇతర రాక్షసులను వాయువ్యాస్త్రంతో సంహరించాడు.
  • యాగం పూర్తయ్యాక విశ్వామిత్రుడు రాముడిని ఆలింగనం చేసుకున్నాడు.

మిథిలా నగర ప్రయాణం

  • మిథిలా నగరంలో జనక మహారాజు యాగం చేస్తున్నాడని, అక్కడ చూడవలసినవి రెండు ఉన్నాయని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు.
  • అందరూ మిథిలా నగరానికి బయలుదేరారు.

https://shorturl.at/egH04

https://youtu.be/bqDv7hjsgN8 

  • Related Posts

    Ramayanam Story in Telugu – రామాయణం 76

    భరతుడి విన్నపం – రాముడి అంగీకారం Ramayanam Story in Telugu- భరతుడు శ్రీరాముడి శిరస్సుపై చేతులు జోడించి “అన్నయ్యా, మా అమ్మ కైకేయి గతంలో రెండు వరాలను కోరింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా జన్మించి, రాజ్యం పొందడానికి అన్ని అర్హతలు…

    భక్తి వాహిని

    భక్తి వాహిని
    Ramayanam Story in Telugu – రామాయణం 75

    శివుని ఆశీర్వచనం Ramayanam Story in Telugu- దేవతలందరితో కలిసి అక్కడకు విచ్చేసిన శివుడు రాముడితో ఇలా పలికాడు: “నాయనా రామా! నీ తమ్ముడు భరతుడు అయోధ్యలో దీనమైన స్థితిలో ఉన్నాడు, అతడిని ఓదార్చు. నీ తల్లి కౌసల్యను ఊరడించు. కైకేయికి,…

    భక్తి వాహిని

    భక్తి వాహిని