Ramayanam Story in Telugu – రామాయణం 59

తెల్లవారుజామున ఆభరణాలు, మంగళవాయిద్యాలు

Ramayanam Story in Telugu- హనుమంతుడు సీతమ్మని చూస్తూ ఉండగానే మెల్లగా తెల్లారింది. తెల్లవారుఝామున బ్రాహ్మీ ముహూర్తంలో ఆ లంక పట్టణంలో బ్రహ్మరాక్షసులు వేద మంత్రాలు చదువుతుండగా, మంగళవాయిద్యాలు వినిపిస్తుండగా రావణుడు నిద్రలేచాడు. తన ఒంటి మీద నుంచి జారిపోతున్న బట్టని గట్టిగా పట్టుకున్నాడు. సీతమ్మ గుర్తుకు రావడంతో చాలా కోరిక కలిగింది. వెంటనే మంచి నగలు పెట్టుకుని, స్నానం కూడా చేయకుండా అశోకవనానికి బయలుదేరాడు. Visit Bakthivahini

రాత్రి రావణుడితో సరసాలు ఆడిన ఆడవాళ్ళు కూడా ఆయన వెనకాల బయలుదేరారు. ఆ ఆడవాళ్ళలో ఒక ఆమె రావణుడి కోసం బంగారు గిన్నెలో మద్యాన్ని పట్టుకుని వెళ్ళింది. ఇంకొక ఆమె రావణుడు ఉమ్మి వేయడం కోసం ఒక గిన్నె పట్టుకుని వెళ్ళింది. కొందరు ఆయనకి గొడుగు పట్టారు. ఆయన వెనకాల కొందరు మంగళవాయిద్యాలు మోగిస్తూ వస్తున్నారు. కొందరు రాక్షసులు కత్తులు పట్టుకుని వచ్చారు. ఇంతమందితో కలిసి దీనురాలైన ఒక స్త్రీ పట్ల తన కోరికని చూపించడానికి తెల్లవారుఝామున బయలుదేరాడు.

సీతమ్మ ఆందోళన

అప్పటివరకు శింశుపా చెట్టు కింద కూర్చుని రాముడిని తలుచుకుంటూ ఉన్న సీతమ్మ రావణుడు రావడం చూసింది. ఇలాంటి దుర్మార్గుడికి శరీరంలో ఏ భాగాలు కనిపిస్తే ఏ ప్రమాదమో అని, ఆడవాళ్ళ శరీర భాగాలు ఏవి కనిపిస్తే మగాడు ఉద్రేకపడతాడో అలాంటి భాగాలు కనపడకుండా జాగ్రత్త పడింది. తన తొడలతో, చేతులతో శరీరాన్ని ముడుచుకుని కూర్చుంది.

అలా ఉన్న సీతమ్మ తగ్గిపోయిన పూజలా, నిందలు మోస్తున్నదానిలా, శ్రద్ధ పోయినదానిలా, యజ్ఞం చేసే చోట చల్లారిపోతున్న నిప్పులా ఉంది. అలా ఉన్న సీతమ్మ దగ్గరికి తెల్లటి పాల నురుగులాంటి బట్టలు వేసుకుని రావణుడు వచ్చాడు. అప్పుడాయన తేజస్సుని చూడలేక హనుమంతుడు కొంచెం వెనక్కి కొమ్మల్లోకి వెళ్ళి ఆకులు అడ్డు పెట్టుకుని చూశాడు.

రావణుడి మాటలు

రావణుడు సీతమ్మతో ఇలా అన్నాడు: “సీతా! నీకు అందమైన చన్నులు ఉన్నాయి. ఏనుగు తొండాల్లాంటి తొడలు ఉన్నాయి. పిరికిదానా! నీకు ఎందుకు భయం? ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేం రాక్షసులమే. ఈ నూరు యోజనాల సముద్రాన్ని దాటి ఎవ్వరూ రాలేరు. నేను అన్ని లోకాలని గెలిచాను. నా వైపు కన్నెత్తి చూసే మొగాడు లేడు. ఇక్కడ తప్పు చేయడానికి భయపడతావెందుకు? ఎవరన్నా మంచి ఆడవాళ్ళు కనిపిస్తే వాళ్ళని తీసుకొచ్చి తమ సొంతం చేసుకోవడం రాక్షసుల ధర్మం. నేను నా ధర్మాన్ని పాటించాను.

ఏదో నేను తప్పు చేసినట్టు చూస్తావేమిటి? మనిషికి శరీరంలో యవ్వనం అనేది కొద్ది కాలమే ఉంటుంది. నువ్వు యవ్వనంలో ఉన్నావు కాబట్టి నేను నిన్ను కోరుకున్నాను. నువ్వు ఇలాగే చెట్టు కింద కూర్చుని ఉపవాసం చేస్తే నీ యవ్వనం పోతుంది. అప్పుడు నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. యవ్వనంలో ఉన్నప్పుడే సుఖాలు అనుభవించాలి. నేను నిన్ను పొందాలనుకుంటే అది నాకు క్షణంలో పని. నేను నిన్ను బలవంతంగా పొందను. నీ అంతట నువ్వు నా పక్కలోకి రావాలి.

ఎందుకు ఇలా ఒకటే జడ వేసుకుని, మురికి బట్ట కట్టుకుని, నేల మీద పడుకుని ఉపవాసాలు చేస్తూ ఉంటావు? నా అంతఃపురంలో ఎన్ని రకాల వంటలు ఉన్నాయో, నగలు ఉన్నాయో, బట్టలు ఉన్నాయో చూడు. ఏడు వేల మంది మంచి ఆడవాళ్ళు నీకు పనివాళ్ళుగా వస్తారు. ఆ రాముడు పేదవాడు. అడవులు పట్టుకుని తిరుగుతున్నాడు. అసలు ఉన్నాడో లేదో కూడా తెలీదు.

దేవతలు కూడా నన్ను ఏమీ చేయలేరు. అలాంటిది ఒక మనిషి ఈ నూరు యోజనాల సముద్రాన్ని దాటి వస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నువ్వు హాయిగా తాగు, తిరుగు, నీకు కావలసినది అనుభవించు. నగలు పెట్టుకుని నాతో సరసాలు ఆడు. నాకున్న ఆస్తి అంతా నీ ఆస్తి. నీ బంధువులని పిలిచి ఈ ఆస్తిని వాళ్ళకి ఇవ్వు” అన్నాడు.

సీతమ్మ సమాధానం

రావణుడి మాటలు విన్న సీతమ్మ స్వచ్ఛంగా నవ్వి ఒక గడ్డిపరకని తనకి రావణుడికి మధ్యలో పెట్టి ఇలా అంది: “రావణా! నీ మనసు నీ భార్యల మీద పెట్టుకో. నీకు చాలా మంది భార్యలు ఉన్నారు. వాళ్ళతో సుఖంగా ఉండు. వేరే వాళ్ళ భార్యల గురించి ఆశపడకు. ఒంట్లో ఓపిక ఉంటే ఎలాగైనా బ్రతకవచ్చు. కానీ చనిపోవడం నీ చేతుల్లో లేదు. నువ్వు సుఖంగా బ్రతకాలన్నా చనిపోవాలన్నా నీకు రాముడి దయ కావాలి.

ఒంట్లో ఓపిక ఉందని పాపం చేస్తున్నావు. ఆ పాపాన్ని అనుభవించవలసినప్పుడు బాధపడతావు. నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించి సంతోషంగా జీవించు. శరణు అన్నవాడిని రాముడు ఏమీ చేయడు. ‘నేను సీతని తీసుకొచ్చాను’ అంటావేమిటి? నీ జీవితంలో నువ్వు నన్ను తేలేవు.

సూర్యుడి నుంచి సూర్యకాంతిని వేరు చేసి తేగలవా? వజ్రం నుంచి వజ్రం యొక్క మెరుపుని వేరు చేసి తేగలవా? పువ్వు నుంచి పువ్వు యొక్క వాసనని వేరు చేసి తేగలవా? ఇవన్నీ ఎలా తేలేవో అలా రాముడి నుండి నన్ను తీసుకురాలేవు. మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అంటావేమో, ఇదంతా నిన్ను చంపడానికి బ్రహ్మగారు వేసిన పథకం.

ఒక పతివ్రత అయిన స్త్రీని ఎత్తుకువచ్చి చేయకూడని పాపం చేశావు. ఇక నీ పాపం పోదు. దీనికి ఒకటే దారి, నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించు, బ్రతికిపోతావు. నేను నిన్ను ఇప్పుడే నా తపస్సు శక్తితో బూడిద చేయగలను. నన్ను రాముడు వచ్చి రక్షిస్తాడన్న కారణంతో ఆగిపోయాను. అసలు ఇక్కడ ధర్మం చెప్పేవారు లేరా? ఒకవేళ ఎవరన్నా చెప్పినా నువ్వు వినవా? ఒకవేళ విన్నా దానిని ఆచరించవా?” అని అడిగింది.

రావణుడి కోపం

ఈ మాటలు విన్న రావణుడికి కోపం వచ్చి ఇలా అన్నాడు: “ఏ ఆడదాని మీద ఎక్కువ కోరిక ఉంటుందో ఆ ఆడదాని మీద పట్టించుకోని స్వభావం కూడా ఉంటుంది. నన్ను చూసి ఇంతమంది ఆడవాళ్ళు కోరుకుని వెనకాల పడ్డారు. నీకు ఆస్తి ఇస్తాను, సింహాసనం మీద కూర్చోబెడతాను, నా పక్కలోకి రా అంటే ఇంత చులకనగా మాట్లాడుతున్నావు.

నీకు నా గొప్పతనం ఏమిటో తెలియడం లేదు” అని అక్కడ ఉన్న రాక్షస స్త్రీలను పిలిచి “ఈమె విషయంలో మంచి మాటలు చెప్పడం, బహుమతులు ఇవ్వడం, భయపెట్టడం లాంటివి చేయమని మీకు చెప్పాను. ఈమె లొంగలేదు, పది నెలల సమయం అయిపోయింది. ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఆ సమయంలో సీత నా పక్కలోకి తనంతట తాను వస్తే సరే, లేకపోతే మీరు సీతని శిక్షించండి” అన్నాడు.

ధాన్యమాలిని ఓదార్పు

రావణుడి భార్య అయిన ధాన్యమాలిని రావణుడిని గట్టిగా కౌగలించుకుని ఇలా అంది: “నీ మీద మనసున్న స్త్రీతో సరసాలు ఆడితే అది ఆనందం. నీ మీద మనసు లేని స్త్రీతో ఎందుకు ఈ సరసాలు? మనం సరసాలు ఆడుకుందాం పద” అనేసరికి ఆ రావణుడు నవ్వుకుంటూ తన భార్యలతో వెనక్కి వెళ్ళిపోయాడు.

Download the article in PDF

Visit Bakthivahini’s Ramayana Section

MS Rama Rao Sundarakanda Telugu

సంస్కారాలు మరియు నైతికత

ఈ కథ రావణుడు చేసిన తప్పు పనులు, హనుమంతుడు సీతమ్మను కాపాడటానికి చేసిన ప్రయత్నం, కవితల్లో చెప్పిన ధర్మం, నీతి ఇంకా స్త్రీల గురించి పైకి చెప్పని కొన్ని లోతైన విషయాలను చూపిస్తుంది.

సంఘటనవివరణ
రావణుడి బయలుదేరడంరావణుడు తన చెడ్డ కోరిక నెరవేర్చుకోవడానికి అశోకవనానికి వెళ్ళాడు.
సీతమ్మ కాపాడుకోవడంసీతమ్మ తన ఒంటిని గట్టిగా కప్పుకొని తనను తాను కాపాడుకుంది.
రావణుడి మాటలురావణుడు సీతమ్మను తప్పుగా తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించాడు.
సీతమ్మ ధైర్యంసీతమ్మ చాలా ధైర్యంగా తన పవిత్రతను, తన భర్త కోసం తాను అనుకున్న వాటిని చెప్పింది.
రావణుడి కోపంరావణుడికి కోపం రావడంతో సీతమ్మను లొంగదీసుకోవడానికి ప్రయత్నించడం మొదలుపెట్టాడు.
  • Related Posts

    Ramayanam in Telugu-రామాయణం 63-కిష్కిందకు తిరుగు ప్రయాణం

    హనుమంతుని ఉత్సాహపూరిత ఆగమనం Ramayanam Story in Telugu- ఆకాశంలోని మేఘాలను తాగుతున్నాడా అన్నట్లుగా వేగంగా ఎగురుకుంటూ వెళ్ళిన హనుమంతుడు, ఉత్తర దిక్కున తన కోసం ఎదురుచూస్తున్న వానరుల వద్దకు చేరుకోగానే ఒక పెద్ద ధ్వని చేశాడు. ఆ శబ్దం విన్న…

    భక్తి వాహిని

    భక్తి వాహిని
    Ramayanam Story in Telugu – రామాయణం 62

    సీతమ్మ వద్ద సెలవు మరియు సంకల్పం Ramayanam Story in Telugu- హనుమంతుడు సీతమ్మ దగ్గర సెలవు తీసుకుని ఉత్తర దిక్కుకు వచ్చాడు. అప్పటికే లంకా పట్టణానికి రావడం, సీతమ్మ తల్లిని దర్శించడం పూర్తయ్యాయి. రావణుడికి ఒక మాట చెబితే ఏమైనా…

    భక్తి వాహిని

    భక్తి వాహిని