Varalaxmi Vratha Katha
సంకల్పం
ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభతిధౌ
అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం
ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం
ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం
సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్త్యర్థం
వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ ముద్దిశ్య వరలక్ష్మీ వ్రత ప్రీత్యర్థం భవిష్యదుత్తరపురాణ కల్పోక్త ప్రకారేణ
యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.
తదంగత్వేన కలశపూజాం కరిష్యే.
కలశ పూజ
కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య కలశస్యోపరి హస్తం నిధాయ.
శ్లోకం
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణా స్మృతాః
కుక్షౌ తు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామ వేదో హ్యధర్వణః
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
ఆయాంతు లక్ష్మీ పూజార్థం దురితక్షయ కారకాః.
గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలే స్మిన్ సన్నిధిం కురు.
ఏవం కలశపూజాం కుర్యాత్.
పూజ ప్రారంభం
ఆదౌ గణాధిపతి పూజాం కుర్యాత్, అనంతరం వరలక్ష్మీ పూజామారభేత్.
వరలక్ష్మీ ధ్యానం
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియే దేవి, సుప్రీతా భవ సర్వదా.
షోడశోపచార పూజ
ధ్యానం
క్షీరోదధి సముద్భూతే కమలే కమలాలయే
సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే.
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధ్యాయామి.
ఆవాహనం
సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే
ఆవాహయామి దేవి త్వాం, సుప్రీతా భవ సర్వదా.
ఆవాహయామి.
రత్న సింహాసనం
సూర్యాయుత నిభ స్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే
సింహాసనమిదం దేవి స్వీకురుష్వామర పూజితే.
రత్న సింహాసనం సమర్పయామి.
అర్ఘ్యం
శుద్దోదకంచ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం
అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సుర పూజితే.
అర్ఘ్యం సమర్పయామి.
పాద్యం
సువాసితం జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం
పాద్యం దేవి త్వం సర్వదేవ నమస్కృతే.
పాద్యం సమర్పయామి.
ఆచమనీయం
సువర్ణకలశానీతం చందనా గురు సంయుతం
గృహాణా చమనం దేవి మయా దత్తం శుభప్రదే.
ఆచమనీయం సమర్పయామి.
పంచామృత స్నానం
పయోదధి మృత పేతం శర్కరా మధు సంయుతం
పంచామృతమిదం స్నానం గృహాణ కమలాలయే.
పంచామృత స్నానం సమర్పయామి.
శుద్ధోదక స్నానం
గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం
శుద్ధోదక స్నానమిదం గృహాణ విధుసోదరి.
శుద్ధోదక స్నానం సమర్పయామి.
వస్త్రయుగ్మం
సురార్చితాంఘ్ర యుగళే దుకూల వసనప్రియే
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే.
వస్త్రయుగ్మం సమర్పయామి.
ఆభరణాని
కేయూర కంకణైర్దివ్యైర్హార నూపుర మేఖలాః
విభూషణాన్య మూల్యాని గృహాణ ఋషిపూజితే.
ఆభరణాని సమర్పయామి.
ఉపవీతం
తప్త హేమకృతం సూత్రం ముక్తా దామ విభూషితం
ఉపవీతమిదం దేవి గృహాణ త్వం శుభప్రదే.
ఉపవీతం సమర్పయామి.
గంధం
కర్పూరాగరు కస్తూరీ గోరోచన సమన్వితం
గంధం దాస్యా మ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం.
గంధం సమర్పయామి.
అక్షతాన్
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయానండులాన్ శుభాన్
హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతాం సుర పూజితే.
అక్షతాన్ సమర్పయామి.
పుష్పాణి
మల్లికా జాజికుసుమైశ్చంపకైర్వకులైస్తథా
నీలోత్పలైశ్చకల్హారైః పూజయామి హరిప్రియే.
పుష్పాణి సమర్పయామి. పూజయామి.
అథాంగ పూజ
చంచలాయై నమః పాదౌ పూజయామి.
చపలాయై నమః జానునీ పూజయామి.
పీతాంబరాయై నమః ఊరూ పూజయామి.
కమలవాసిన్యై నమః కటిం పూజయామి.
పద్మాలయాయై నమః నాభిం పూజయామి.
మదనమాత్రే నమః స్తనౌ పూజయామి.
కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి.
సుముఖాయై నమః ముఖం పూజయామి.
సునేత్రాయై నమః నేత్రే పూజయామి.
రమాయై నమః కర్ణౌ పూజయామి.
కమలాయై నమః శిరః పూజయామి.
శ్రీ వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి.
ధ్యానం
వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం.
హస్తాభ్యా మభయ ప్రదాం మణిగణై ర్నానావిధై ర్భూషితాం.
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభి స్సేవితాం.
పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభి ర్యుక్తాం సదాశక్తిభిః.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామావళి
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం పద్మాయై నమః
ఓం శుచయే నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః
ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం క్షమాయై నమః
ఓం క్షీరోదసంభవాయై నమః
ఓం అనుగ్రహపరాయై నమః
ఓం బుద్ధయే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంధిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుస్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం తుప్ట్యై నమః
ఓం దారిద్య్రనాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం స్త్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మగతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళా దేవ్యై నమః
ఓం విష్ణువక్షఃస్థలస్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః
ఓం నారాయణసమాశ్రితాయై నమః
ఓం దారిద్య్రధ్వంసిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాల్యై నమః
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
లక్ష్మీ స్తోత్రం
లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీ రంగధామేశ్వరీమ్
దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్
ధూపం
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం
ధూపం దాస్యామి తే దేవి శ్రీ వరలక్ష్మి గృహాణ త్వం.
ధూపం సమర్పయామి.
దీపం
ఘృతాక్తవర్తి సంయుక్త మంధకార వినాశకం
దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితా భవ.
దీపం సమర్పయామి.
నైవేద్యం
నైవేద్యం షడ్రసోపేతం దధిమ ధ్వాజ్య సంయుతం
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే.
నైవేద్యం సమర్పయామి.
పానీయం
ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం
పానీయం గృహ్యతాం దేవి విమలం సుమనోహరం.
పానీయం సమర్పయామి.
తాంబూలం
పూగీఫల సమా యుక్తం నాగవల్లీ దళైర్యుతం
ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం.
తాంబూలం సమర్పయామి.
నీరాజనం
నీరాజనం మనోహరి కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే.
నీరాజనం సమర్పయామి.
మంత్రపుష్పం
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా.
మంత్రపుష్పం సమర్పయామి.
ప్రదక్షిణం
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే.
ప్రదక్షిణం సమర్పయామి.
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్
నమస్తే లోక జనని నమస్తే విష్ణువల్లభే
పాహిమాం భక్త వరదే వరలక్ష్మి నమోనమః.
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
అథ తోర గ్రంథి – పూజ
కమలాయై నమః ప్రథమ గ్రంధిం పూజయామి.
రమాయై నమః ద్వితీయ గ్రంధిం పూజయామి.
లోకమాత్రే నమః తృతీయ గ్రంధిం పూజయామి.
సర్వజనన్యై నమః చతుర్ధ గ్రంధిం పూజయామి.
మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంధిం పూజయామి.
క్షీరాబ్ది తనయాయై నమః షష్ఠ గ్రంధిం పూజయామి.
విరూపాక్ష్యై నమః సప్తమ గ్రంధిం పూజయామి.
చంద్ర సోదర్యై నమః అష్టమ గ్రంధిం పూజయామి.
హరివల్లభాయై నమః నవమ గ్రంధిం పూజయామి.
తోర బంధన మంత్రం
బధ్నామి దక్షిణే హస్తే నవ సూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌఖ్యం దేహి మే రమే.
(ఈ మంత్రం పఠనము చేయుచు తోరణము కట్టుకొనవలెను)
వాయనదాన మంత్రం
ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః
దాతవ్యం ద్వాదశా పూపం వాయనం హి ద్విజాతయే.
ఇందిరా ప్రతిగృహ్లాతు ఇందిరా వై దదాతిచ,
ఇందిరా తారకోభాభ్యామిందిరాయై నమో నమః.
ఇతి పూజా విధానం సంపూర్ణమ్.
అథ కథా ప్రారంభం
శ్లోకం
కైలాస శిఖరే రమ్యే నానాగణ నిషేవితే
మందార విటపి ప్రాంతే నానామణి విభూషితే.
పాటలాశోక పున్నాగ ఖర్జూర వకుళాన్వితే,
కుబేర వరుణేంద్రాది దిక్పాలైశ్చ సమావృతే.
నారదాగస్త్య వాల్మీకి పరాశర సమావృతే,
రత్నపీఠే, సుఖాసీనం శంకరం లోకశంకరం.
ప్రపచ్ఛ గౌరీ సంతుష్టా లోకానుగ్రహ కామ్యయా.
‘భగవన్! సర్వలోకేశ సర్వభూత హితే రత,
యద్రహస్య వ్రతం పుణ్యం తదాచక్ష్య మమానఘ’.
ఈశ్వర ఉవాచ
వ్రతానాముత్తమం నామ సర్వ సౌభాగ్యకారణం
సర్వ సంపత్ప్రదం శీఘ్రం పుత్రపౌత్ర ప్రవర్ధనం.
వరలక్ష్మీ వ్రతం నామ వ్రతమస్తి మనోహరం
శుక్లే శ్రావణే మాసే, పూర్ణిమో పాంత్యభార్గవే.
యథాతు నారీ వర్తేత వ్రతే తస్యాః ఫలం శృణుః.
గౌరీ ఉవాచ
విధినా కేన కర్తవ్యం తత్ర కా నామ దేవతా
కయాచారాధితా పూర్వం! సాభూత్సంతుష్ట మానసా!
వరలక్ష్మీ వ్రతం పుణ్యం వక్ష్యామి శృణు పార్వతి,
కుండినం నామ నగరం సర్వ మండల మండితం.
హేమ ప్రాకార సంయుక్తం చామీకర గృహోజ్జ్వలం
తత్రా భూద్ బ్రాహ్మణీ, కాచిత్ నామ్నా చారుమతీ శ్రుతా.
సతి భక్తి రతా సాధ్వీ శ్వశ్రూశ్వశురయోర్ముదా,
కళావతీ విదుషీ సతతం మంజుభాషిణీ.
తస్యాః ప్రసన్న చిత్తాయా లక్ష్మీ స్సప్నగతా తదా,
ఏహి కళ్యాణి భద్రం తే వరలక్ష్మీ సమాగతా.
సభో మాసే పూర్ణిమాయాం నాతిక్రాంతే భృగోర్దివే.
మత్పూజా తత్ర కర్తవ్యా వరం దాస్యామి కాంక్షితమ్.
ఇత్యుక్తా వరలక్ష్మీ సాతుష్టా చ పరయా ముదా
నమస్తే సర్వ లోకానాం జనన్యై పుణ్య మూర్తయే.
శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణువక్షస్థలాలయే,
త్వయావ లోకిత స్పద్యః స ధన్య స్ప గుణాన్వితః.
సశ్లాఘ్య స్స కుటుంబీ చ స శూర స్స చ పండితః.
జన్మాంతర సహస్రేషు కిం మయా సుకృతం కృతం
అతస్త్యత్ పాదయుగళం పశ్యామి హరివల్లభే.
ఏవం స్తుతా సా కమలా దదౌ తస్యై బహూన్ వరాన్,
తతశ్చారుమతీ సాధ్వీ స్వప్నాదుత్తాయ సంభ్రమాత్.
తత్సర్వం కథయా మాస బంధూనాం పురత స్తథా
శ్రుత్వాతు బాంధవాస్సర్వే సాధు సాధ్వితిచాబ్రువన్.
తధైవ కరవామేతి తదాగమన కాంక్షిణః
భాగ్యోదయేన సం ప్రాప్తే వరలక్ష్మీ దినే తథా.
స్త్రీయః ప్రసన్న హృదయా నిర్మలాశ్చ ప్రవాససః
నూతనైస్తండులైః పూర్ణ కుంభే చ వటపల్లవైః.
సాయం చారుమతీ ముఖ్యాం చక్రే పూజాం ప్రయత్నతః
పద్మాసనే పద్మకరే సర్వ లోకైక పూజితే.
నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా,
ఇత్యాది మంత్రైః సకలైరుపచారాన్ యథాక్రమం.
కృత్వాతు దక్షిణే హస్తే నవ సూత్రం దధుః స్త్రీయః
హవిష్యం సంఘృతం చైవ వరలక్ష్మ్యై న్యవేదయన్.
గంధాదిభిరలంకృత్య సుశీలం వృద్ధ భూసురం
తస్మై దత్వా వాయవంచ ద్వాదశా పూప సంయుతం.
తతో దేవీ సమీపేతు హవిష్యం చక్రు రంగనాః
అధ లక్ష్మీ ప్రసాదేన ముక్తా మాణిక్య భూషితాః.
నూపురాక్రాంత చరణా మణి కాంచన భూషణాః
పుత్రపౌత్రైః పరివృతా ధన ధాన్య సమృద్ధిభిః.
అన్నదాన రతా నిత్యం బంధు పోషణ తత్పరాః.
స్వం స్వం సద్మ సమాజగ్ముర్ హస్త్యశ్వ రథ సంకులం.
అన్యోన్యం కథయా మాసుః శ్రుతం చారుమతీ ముఖాత్.
ఇదం సత్యమిదం సత్యం సర్వో భద్రాణి పశ్యతి.
వయం చారుమతీ ముఖ్యా ఉపలబ్ధ మనో రథాః.
పుణ్యా చారుమతీ ధన్యా భూయో భాగ్యవతీ చిరం.
స్వయం యస్మాన్ మహాలక్ష్మ్యా బోధితం హి వ్రతోత్తమం.
ఇతి చారుమతీం సాధ్వీం తుష్టుపుస్తత్ర యోషితః.
వరలక్ష్మీవ్రతం నామ తదా దిభువి విశ్రుతం.
ఏతత్తే పరమాఖ్యాతం వ్రతానాముత్తమం వ్రతం.
య ఇదం శ్రుణుయాద్వాపి శ్రావయే ద్వా సమాహితః.
సిద్ధ్యంతి సర్వకార్యాణి వరలక్ష్మీ ప్రసాదతః.
ఇతి భవిష్యోత్తర పురాణే పార్వతీ పరమేశ్వర సంవాదే వరలక్ష్మీ వ్రతకథా సమాప్తం.
కథా ప్రారంభం
సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులను ఉద్దేశించి, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలను కలిగించే ఒక గొప్ప వ్రతం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారని వివరించాడు. ఆ వ్రతం గురించి తాను చెప్పబోతున్నానని మహర్షులకు తెలిపాడు.
పార్వతీదేవి ప్రశ్న
కైలాస పర్వతంలో, వజ్ర వైఢూర్యాలు పొదిగిన సింహాసనంపై కూర్చున్న పరమేశ్వరుడిని పార్వతీదేవి నమస్కరించి, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సకల సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాదులు పొంది సుఖంగా ఉంటారో ఆ వ్రతాన్ని తనకు ఉపదేశించమని ప్రార్థించింది.
పరమేశ్వరుడి సమాధానం
పార్వతీదేవి అడిగిన ప్రశ్నకు పరమేశ్వరుడు, స్త్రీలకు పుత్రపౌత్రాది సంపదలను కలిగించే వరలక్ష్మీ వ్రతం గురించి చెప్పాడు. ఈ వ్రతాన్ని శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు చేయాలని తెలిపాడు.
పార్వతీదేవి తిరిగి ప్రశ్నించడం
పరమేశ్వరుడి సమాధానం విన్న పార్వతీదేవి, “ఓ లోకారాధ్యా! మీరు చెప్పిన వరలక్ష్మీ వ్రతాన్ని ఎలా చేయాలి? ఆ వ్రతానికి విధి ఏమిటి? ఏ దేవతను పూజించాలి? పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారు? వీటిని అన్నింటినీ వివరంగా చెప్పండి” అని ప్రార్థించింది.
పరమేశ్వరుడు వ్రత విధానాన్ని వివరించడం
పార్వతీదేవి ప్రార్థన విన్న పరమేశ్వరుడు, “ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రతం గురించి సవివరంగా చెబుతాను విను” అని ప్రారంభించాడు.
చారుమతి వృత్తాంతం
- కుండిన నగర వర్ణన: మగధదేశంలో కుండినం అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణం బంగారు ప్రాకారాలతో, బంగారు గోడలున్న ఇళ్లతో అద్భుతంగా ఉండేది.
- చారుమతి గురించి: ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె తన భర్తను దైవంతో సమానంగా భావించేది.
- చారుమతి దినచర్య: ఆమె ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి, పుష్పాలతో భర్తను పూజించేది. అత్తమామలకు అనేక విధాలుగా ఉపచారాలు చేసేది. ఇంటి పనులను చక్కగా చేసుకుంటూ, గయ్యాళిగా కాకుండా, మితంగా, ప్రియంగా మాట్లాడేది.
వరలక్ష్మీదేవి స్వప్నం
ఒకనాడు ఆ మహా పతివ్రతయైన చారుమతిపై వరలక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది. ఒక స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరించి, “ఓ చారుమతీ! నేను వరలక్ష్మీదేవిని. నీయందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమయ్యాను. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజిస్తే నీవు కోరిన వరాలను ఇస్తాను” అని చెప్పింది.
చారుమతి స్తుతి
చారుమతీదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, “నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే” అని అనేక విధాలుగా స్తుతించింది. “ఓ జగజ్జననీ! నీ కటాక్షం కలిగితే జనులు ధన్యులుగను, విద్వాంసులుగను, సకల సంపన్నులుగను అవుతారు. నేను కూడా పూర్వజన్మలో చేసిన పుణ్య విశేషం వల్లనే నీ పాదదర్శనం నాకు కలిగింది” అని పలికింది.
వరలక్ష్మీదేవి అనుగ్రహం
వరలక్ష్మీదేవి సంతోషించి, చారుమతికి అనేక వరాలను ఇచ్చి అంతర్ధానం అయింది. చారుమతి వెంటనే నిద్ర లేచి, ఇల్లు అంతా చూసి వరలక్ష్మీదేవిని చూడలేక, “ఓహో! మనం కల కన్నాము” అనుకుంది.
స్వప్న వృత్తాంతం వివరించడం
ఆ స్వప్న వృత్తాంతాన్ని తన భర్తకు, మామగారికి మరియు ఇతరులకు చెప్పగా, వారు ఈ స్వప్నం చాలా ఉత్తమమైనదని, శ్రావణ మాసం వచ్చిన వెంటనే వరలక్ష్మీ వ్రతాన్ని తప్పకుండా చేయాలని చెప్పారు.
వ్రతం కొరకు ఎదురుచూడటం
ఆ తర్వాత చారుమతి మరియు స్వప్నం విన్న ఇతర స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు.
వ్రతం ఆచరించడం
- శుక్రవారం రాక: వారి అదృష్టం వల్ల శ్రావణ మాస పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వచ్చింది.
- వ్రత సన్నాహాలు: చారుమతి మరియు ఇతర స్త్రీలందరూ ఆ దినం వరలక్ష్మీదేవి చెప్పిన దినమని ఉదయాన్నే నిద్రలేచి స్నానాలు చేసి, చిత్ర వస్త్రాలను కట్టుకున్నారు.
- పూజా స్థలం ఏర్పాటు: చారుమతీదేవి ఇంట్లో ఒక ప్రదేశాన్ని గోమయంతో అలికి, మంటపాన్ని ఏర్పరచి, దానిపై ఒక ఆసనం వేసి, దానిపై కొత్త బియ్యం పోశారు. మట్టిచిగుళ్లు మొదలైన పంచ పల్లవాలతో కలశాన్ని ఏర్పరచి, అందులో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు.
- పూజ: చారుమతితో సహా స్త్రీలందరూ అత్యంత భక్తితో సాయంకాలం “పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే, నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా” అనే శ్లోకంతో ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేశారు.
- తోరం ధరించడం: తొమ్మిది సూత్రాలున్న తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు.
- నివేదనలు: వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్యభోజనాలను నివేదన చేసి ప్రదక్షిణలు చేశారు.
వరలక్ష్మీదేవి అనుగ్రహం (ఫలితం)
- మొదటి ప్రదక్షిణ: ఒక ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళ యందు గజ్జెల శబ్దం వినిపించింది. కాళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణాలు ఉండటం గమనించారు. వరలక్ష్మీదేవి కటాక్షం వలనే ఇవి కలిగాయని పరమానందం పొందారు.
- రెండవ ప్రదక్షిణ: మరియొక ప్రదక్షిణం చేయగా, చేతులయందు ధగద్ధగాయమానంగా మెరిసిపోతున్న నవరత్నాలు పొదిగిన ఆభరణాలు ఉండటం చూశారు.
- మూడవ ప్రదక్షిణ: మూడవ ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలందరూ సర్వాభరణాలతో అలంకరించబడ్డారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయం అయి, రథ, గజ, తురంగ వాహనాలతో నిండిపోయాయి.
బ్రాహ్మణునికి దానం, ఇంటికి తిరిగి వెళ్లడం
- వాహనాలు: ఆ స్త్రీలను తమ ఇళ్లకు తీసుకువెళ్లడానికి వారి ఇళ్ళ నుండి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజిస్తున్న స్థలం వద్దకు వచ్చి నిండిపోయాయి.
- దానం: చారుమతి మొదలైన స్త్రీలందరూ తమకు పూజ చేయించిన బ్రాహ్మణోత్తముడిని గంధ పుష్పాక్షతలతో పూజించి, పన్నెండు కుడుములు వాయన దానం ఇచ్చి, దక్షిణ తాంబూలాలు సమర్పించి నమస్కారం చేశారు.
- ఆశీస్సులు: ఆ బ్రాహ్మణోత్తముడిచే ఆశీర్వాదం పొంది, వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్యాదులను బంధువులతో కలిసి భుజించారు.
- ఇంటికి ప్రయాణం: తమ కొరకు వచ్చి వేచి ఉన్న వాహనాలలో ఇళ్లకు వెళ్తూ, ఒకరితో ఒకరు “ఓహో! చారుమతీదేవి భాగ్యం ఏమి చెప్పగలం. వరలక్ష్మీదేవి తనంతట స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమైంది. ఆ చారుమతీదేవి వల్లనే కదా మనకిట్టి మహాభాగ్య సంపదలు కలిగాయి” అని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుతూ తమ తమ ఇళ్లకు వెళ్లారు.
వ్రత ప్రాముఖ్యత
ఆ తర్వాత చారుమతి మొదలైన స్త్రీలందరూ ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని చేస్తూ, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి, ధన కనక వస్తు వాహనాలతో సుఖంగా ఉన్నారు. కాబట్టి ఓ పార్వతీ! ఈ ఉత్తమమైన వ్రతాన్ని బ్రాహ్మణాది నాలుగు జాతుల వారూ చేయవచ్చు. అలా చేస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి సుఖంగా ఉంటారు. ఈ కథను విన్నవారికీ, చదివినవారికీ వరలక్ష్మీ ప్రసాదం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తాయి.
మంగళహారతి
రమణీ మంగళ మనరే కమలాలయకు నిటు
సమద కుంజర యానకూ, సకల సుకృత నిధానకు ॥రమణీ॥
కమల రిపు బింబాననకు, కరకమల భక్తాభిమానకు
లలిత పల్లవ పాణికి, జలధర నిభ, వేణికి, ॥రమణీ॥
జలజలోచను రాణికి సాధు సుగుణ శ్రేణికి
కలుములీనెడి మొలక నవ్వుల కలికి తలిరుబోణికి ॥రమణీ॥
సారస దళ నేత్రికి, చారు మంగళ గాత్రికి
భూరి కరుణా ధాత్రికి, సర్వ వనితా మైత్రికి ॥రమణీ॥
సకల దురిత లవిత్రికి, క్షీర పారావార పుత్రికి
పోషి తాశ్రిత లోకకూ, దురిత కానన దావకు ॥రమణీ॥
శేష వాహన జలజలోచన శ్రీకరానంగావలోకకు ॥రమణీ మంగళ॥
శ్రావణ శుక్రవారపు పాట
కైలాస గిరిలోను కల్పవృక్షము క్రింద ప్రమథాది గణములు కొలువగాను,
పార్వతీ పరమేశ్వరులు బాగుగా కూర్చుండ పరమేశ్వరుని యడిగె పార్వతపుడు.
॥జయ మంగళం నిత్య శుభమంగళం॥
ఏ వ్రతము సంపదల నెలమితోడుత నిచ్చుయే వ్రతము పుత్రపౌత్రాభివృద్ధి నొసగు
అనుచు పార్వతి యా హరుని యడుగంగా పరమేశు డీరీతి పలుకసాగె. ॥జయ॥
కుండినం బనియేటి పట్నంబు లోపల చారుమతి అనియేటి చేడె గలదు
అత్తమామల సేవ అతిభక్తితో జేసి, పతిభక్తి గలిగుండు భాగ్యశాలి. ॥జయ॥
వనిత స్వప్నమునందు వరలక్ష్మి తాబోయి చారుమతి లెమ్మని చేత చరచె,
చరచినప్పుడు లేచి తల్లి మీరెవ్వరని నమస్కరించెనా నలినాక్షికి. ॥జయ॥
వరలక్ష్మినే నేను వరమూలు యిచ్చేను మేల్కొనవె చారుమతి మేలుగాను
కొలచినప్పుడు మెచ్చి కోరిన రాజ్యముల్ వరములా నిచ్చేటి వరలక్ష్మిని. ॥జయ॥
ఏ విధిని పూజను చేయవలెననుచూ చారుమతి యడిగెనూ శ్రావ్యముగనూ
యేమి మాసంబున యేమి పక్షంబున యేవారమూనాడు యే ప్రొద్దున. ॥జయ॥
శ్రావణమాసాన శుక్లపక్షమునందు శుక్రవారమునాడు మునిమాపునా
పంచ కల్వలు దెచ్చి బాగుగా నను నిల్పి భక్తితో పూజించమని చెప్పెను. ॥జయ॥
చారుమతి లేచి యా శయ్యపై కూర్చుండి బంధువుల పిలిపించి బాగుగాను
స్వప్నమున శ్రీమహాలక్ష్మీ చకచక వచ్చి కొల్వమని పల్కెను కాంతలారా. ॥జయ॥
ఏ విధమున పూజ చేయవలెనన్నదో బంధువులుయడిగిరీ ప్రేమతోను,
యేమి మాసంబున యేమి పక్షంబున యేవారమూనాడు యే ప్రొద్దున. ॥జయ॥
శ్రావణమాసాన శుక్లపక్షమునందు శుక్రవారమునాడు మునిమాపునా
పంచ కల్వలు దెచ్చి బాగుగా నను నిల్పి భక్తితో పూజించమని చెప్పెను. ॥జయ॥
అపుడు శ్రావణమాసమది ముందువచ్చెనని భక్తితో పట్నము నలంకరించి
వన్నె తోరణాలు సన్న జాజులతో చెన్నుగా నగరు శృంగారించిరి. ॥జయ॥
వరలక్ష్మీ నోమనుచు వనితలు అందరూ పసుపుతో పట్టుపుట్టములుగట్టి
పూర్ణపు కుడుములూ పాయసాన్నములు అవశ్యముగ నైవేద్యము పెడుదురు. ॥జయ॥
కండి మండిగలు మండిగలుగడగ నెంచి యొండిన కుడుములు ఘనవడలనూ
దండిగా పళ్లేల ఖర్జూర ఫలములూ విధిగ నైవేద్యములు పెడుదురు. ॥జయ॥
నిండు బిందెలలోను నిర్మల వుదకమూ, పుండరీకాక్షునకు వారుపోసి
తొమ్మిది పోగుల తోరమొప్పగ పోసి తల్లికి కడు సంభ్రమునను. ॥జయ॥
వేదవిదుడైనట్టి విప్రుని పిలిపించి గంధనుక్షతలిచ్చి కాళ్లుకడిగి. ॥జయ॥
తొమ్మిది పిండి వంటలలోను రయ మొప్పగ బ్రాహ్మణునకు పాయసం బెట్టుదూరు. ॥జయ॥
శ్రావణ శుక్రవారపు పాట సంపూర్ణమ్.
శ్రీ మహాలక్ష్మీ అష్టకమ్
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే,
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే
నమస్తే గరుడారూఢ డోలాసుర భయంకరి,
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే
సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి,
సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని,
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే
ఆద్యన్తరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి,
యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మి నమోస్తుతే
స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే,
మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి,
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే,
జగత్స్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే
ఫలశ్రుతి
మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః,
సర్వసిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం,
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్య సమన్వితః
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం
మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా
ఇతీంద్రకృత మహాలక్ష్మ్యష్టక స్తవం సంపూర్ణమ్.